అరటి పండ్లను తింటే మనకు ఎన్నో పోషకాలతోపాటు శక్తి కూడా లభిస్తుంది. సాధారణంగా వ్యాయామం చేసేవారు, జిమ్‌కు వెళ్లేవారు శక్తి కోసం అరటి పండ్లను తింటుంటారు. అరటి పండ్లలో ఉండే పోషకాలు మనకు పోషణను అందిస్తాయి. అయితే అరటి పండ్లను రాత్రి పూట తినవచ్చా ? అంటే..
అరటి పండ్లను ఉదయం లేదా మధ్యాహ్నం తింటే మంచిది. రాత్రి పూట తినదలిస్తే 7 గంటలలోపే తినాలి. ఎందుకంటే అరటి పండ్ల వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. రాత్రి 7 గంటలకు భోజనం ముగించే వారు అరటి పండ్లను తినడం ఉత్తమం. కానీ ఇంకా ఆలస్యంగా తినరాదు. తింటే అధిక బరువు పెరుగుతారు. శరీరంలో ప్లీహం ఎక్కువగా చేరుతుంది.
అరటి పండ్లను రాత్రి కన్నా పగటిపూట తింటేనే ఎక్కువగా ఫలితం ఉంటుంది. దీని వల్ల ఫైబర్ పుష్కలంగా అందుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్, అసిడిటీ ఉండవు. విటమిన్ బి6 పుష్కలంగా లభిస్తుంది. శక్తి అందుతుంది కనుక ఉత్సాహంగా పనిచేయవచ్చు. కానీ రాత్రి పూట అయితే అరటి పండ్లతో లభించే శక్తితో మనం ఏమీ చేయలేం. నిద్రించడం ఒక్కటే చేస్తాం. కనుక ఆ శక్తి అంతా క్యాలరీల రూపంలో మన శరీరంలో నిల్వ అయి బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కనుక అరటి పండ్లను రాత్రి పూట తినకపోవడమే ఉత్తమం.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365