Categories: Featured

మనిషి స‌రిగ్గా నిద్ర పోకపోతే ఏం జరుగుతుంది ?

ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో స‌గ‌టు పౌరుడికి నిత్యం నిద్ర క‌రువ‌వుతోంది. అనేక ఒత్తిళ్ల మ‌ధ్య కాలం గ‌డుపుతుండ‌డంతో నిద్ర స‌రిగ్గా పోవ‌డం అనేది స‌మ‌స్య‌గా మారింది. అయితే నిజానికి నిద్ర అనేది చాలా వ‌ర‌కు అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కార‌ణం అవుతుంది. మ‌నిషి నిద్రపోవడం చాలా అత్యవసరం. ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒక పనితో ప్ర‌తి ఒక్క‌రూ అలిసిపోతూనే ఉంటారు. అలా అలిసిపోయిన శరీరానికి రెస్ట్ ఇవ్వాలి. లేదంటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

sleeplessness side effects in telugu

* నిద్ర స‌రిగ్గా పోక‌పోతే శ‌రీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. అంటే క్లోమ గ్రంథి ఉత్ప‌త్తి చేసే ఇన్సులిన్‌ను శ‌రీరం స‌రిగ్గా గ్ర‌హించ‌లేదు. ఫ‌లితంగా అధిక బ‌రువు పెరుగుతారు. డ‌యాబెటిస్ వ‌స్తుంది.

* నిత్యం స‌రిగ్గా నిద్రించ‌క‌పోతే థైరాయిడ్ వ్యాధులు, గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

* స‌రిగ్గా నిద్రించ‌ని వారిలో డిప్రెష‌న్‌, ఒత్తిడి, ఆందోళ‌న స్థాయిలు అధికంగా ఉంటాయ‌ని సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. అలాగే నిద్ర స‌రిగ్గా పోక‌పోతే విసుగు, కోపం వంటివి వ‌స్తాయి.

* శ‌రీర మెట‌బాలిజం నెమ్మ‌దిస్తుంది. ఫ‌లితంగా మ‌నం తినే ఆహారం ద్వారా మ‌న‌కు ల‌భించే క్యాల‌రీలు స‌రిగ్గా ఖర్చు కావు. దీంతో శ‌రీరంలో కొవ్వు చేరుతుంది. అధికంగా బ‌రువు పెరుగుతారు.

* చ‌ర్మం పొడిబారుతుంది. జుట్టు రాలుతుంది. ఇత‌ర చ‌ర్మ‌, జుట్టు స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

క‌నుక నిత్యం టైముకు నిద్రించాలి. త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్ర‌పోవాలి. రోజుకు క‌నీసం 6 నుంచి 8 గంట‌ల పాటు శ‌రీరానికి త‌గిన‌ట్టుగా నిద్రించాల‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే నిత్యం 8 గ్లాసుల వ‌ర‌కు నీటిని తాగితే మంచిది. అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts