food

ఆంధ్ర స్పెషల్: ఆంధ్ర స్టైల్ లో పెప్పర్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆంధ్ర స్టైల్ లో వంటకాలు అంటే ఆటోమేటిక్ గా స్పైసి గా ఉంటాయి&period; ఇక చికెన్ రెసిపీ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు&period; మరి చికెన్ రెసిపీ పిల్లలు ఎంతో ఫేమస్ అయిన పెప్పర్ చికెన్ ఆంధ్ర స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ అరకిలో&comma; వెల్లుల్లి గుప్పెడు&comma; అల్లం చిన్న ముక్కలు రెండు&comma; ఉల్లిపాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు&comma; పచ్చిమిర్చి 2&comma; ఉప్పు తగినంత&comma; కొత్తిమీర కొద్దిగా&comma; మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్&comma; ధనియాల పొడి టేబుల్ స్పూన్&comma; నూనె కొద్దిగా&comma; లవంగాలు 4&comma; నిమ్మకాయ ఒకటి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65013 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;pepper-chicken&period;jpg" alt&equals;"andhra style pepper chicken recipe in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా వెల్లుల్లి&comma; అల్లం&comma; లవంగాలను మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి&period; తర్వాత మరొక గిన్నెలో చికెన్ ముక్కలు వేసి అందులోకి తయారుచేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని&comma; తగినంత ఉప్పు&comma; పసుపు&comma; నిమ్మకాయ సగం పిండుకొని ఈ మిశ్రమం మొత్తం చికెన్ ముక్కలకు అంటుకునే విధంగా కలిపి ఓ అరగంట పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అరగంట తర్వాత స్టవ్ పై ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేయాలి&period; నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి&period; ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా వేయించాలి&period; ఉల్లిపాయ ముక్కలు ముదురు బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించుకోవాలి&period;తరువాత ఈ మిశ్రమం లోకి ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేయాలి&period; చికెన్ ముక్కలు మెత్తగా కావడం కోసం కొద్దిగా నీటిని వేసుకోవచ్చు&period; నీరు ఇంటికి పోతున్న సమయంలో మిరియాల పొడి&comma; ధనియాల పొడి కలియ బెట్టాలి&period; చికెన్ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయడానికి ముందుగా కొద్దిగా కొత్తిమీర తురుము పైన చల్లుకొని స్టౌ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ పెప్పర్ చికెన్ తయారైనట్లే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts