ఊరగాయ పాతబడి ఎండిపోతే అరస్పూను చెరుకురసం కలిపి చూడండి. కంది పప్పు ఉడకాలంటే, ఉడుకుతున్నప్పుడు నాలుగైదు బియ్యపు గింజలు వేస్తే చాలు. అలాగే కంది పప్పు ఉడుకుతున్నప్పుడు పొంగితే, రెండు నూనె బొట్లు వేస్తే పొంగు తగ్గి పోతుంది. కేక్ తయారు చేసే సమయంలో పిండికి చిటికెడు సాల్ట్ కలిపితే కేక్ చాలా రుచిగా ఉంటుంది. కాకరకాయ కూర వండేటప్పుడు వీలైతే అందులో రెండు పచ్చి మామిడి కాయ ముక్కలు వేయండి. చేదు తగ్గడమే కాదు, కూరకు కొత్త రుచి వస్తుంది.
కాఫీ మరీ చేదుగా అనిపిస్తే కాస్త ఉప్పు కలపండి, తాగడానికి రుచిగా ఉంటుంది. క్యారెట్‌తో ఏ కూర చేసినా, అది ఉడికే సమయంలో కాస్తంత పంచదార వేయండి. ఇదే పద్దతిని గ్రీన్ పీస్‌తో చేసే కూరలకు కూడా. క్యారెట్ హల్వా తయారయ్యాక దానికి కొద్దిగా బియ్యపు పిండి కలపండి. కేరెట్ హల్వా మంచి రుచిగా ఉంటుంది. కుక్కర్ లో పప్పు ఉడికించినప్పుడు ఒక్కోసారి పప్పులో నీరు ఎక్కువైపోతుంది. ఆ వేడి వేడి పప్పుతేరును చపాతి పిండిలో పోసి నానబెడితే పప్పులో ఉన్న పోషకవిలువలు వృధాకావు, చపాతీలు మృదువుగా వస్తాయి.
కూరగాయలు ఉడికించేటప్పుడు కొంచెం నిమ్మరసం చల్లితే రంగు మారకుండా ఉంటాయి. సూపుల్లో కొన్ని చుక్కల నిమ్మరసం వేస్తే మంచి రుచి వస్తుంది. కూరలలో పసుపు ఎక్కువయితే కూర ఉంచిన పాత్రపై ఒక శుభ్రమైన బట్టను పరచినట్టుగా కడితే అధిక పసుపును అది పీల్చేసుకుంటుంది.