food

బీట్‌రూట్ కూర‌ను ఇలా చేయండి.. టేస్టీగా ఉంటుంది..!

బీట్ రూట్ అంటే స‌హ‌జంగానే కొంద‌రికి అయిష్టంగా ఉంటుంది. దీన్ని ముట్టుకుంటే చాలు.. పింక్ రంగులో చేతుల‌కు అంతా అంటుతుంది. క‌నుక చాలా మంది దీన్ని తినేందుకు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. అయితే బీట్‌రూట్ వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీంతో కూర‌ను ఇలా చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇష్టం లేని వారు కూడా ఈ కూర‌ను లాగించేస్తారు. ఇక బీట్ రూట్ కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో, ఈ కూర‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బీట్ రూట్ కూటు త‌యారీకి కావలసిన పదార్ధాలు:

బీట్రూట్ ముక్కలు: 1 చిన్న కప్పు, ఉడికించినది కంది పప్పు: 2 కప్పులు, ఉడికించినది చిక్కటి చింతపండు పులుసు: 1 కప్పు, నీరు: 2 కప్పులు, ఉప్పు: తగినంత, పోపుకి :ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు తగినంత.

how to make beetroot kootu

కూటు తయారికి: ధనియాలు:1 టీస్పూన్‌, శనగపప్పు: ½ టీస్పూన్‌, మినపప్పు:1/4 టీస్పూన్‌, ఎండు మిరపకాయలు: 4, ఎండు కొబ్బరి: 1 టీస్పూన్‌, ఇంగువ: చిటికెదు, నూనె: ¼ టీస్పూన్‌.

తయారి విధానం:

ముందుగా బాణెలిలో కొంచెం నూనె వేసి కూటు తయారీకి కావలసిన పదార్ధాలన్ని వేసుకుని దోరగ వేయించుకుని, బాగ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది ఎంత మెత్తగా వుంటే కూటు అంత బాగుంటుంది. తరువాత మూకుడులో కొంచెం నూనె వేసి పోపు వేసి వేయించుకున్నాక, ఉడికించిన బీట్రూట్ ముక్కలు, చింతపండు పులుసు పోసుకుని దానికి నీరు కలిపి తగినంత ఉప్పు, పసుపు వేసి ఉడకనివ్వాలి. ఇది బాగ కళ పెళ ఉడుకుతున్నప్పుడు పైన రుబ్బుకున్న కూటు కలిపి ఉడకనివ్వాలి. ఈ పులుసు ఉడుకుతున్నప్పుడు ఉడికించుకున్న కంది పప్పు కూడ కలిపి 10 నిమిషాలు ఉడకనివ్వాలి.

Admin