food

కాక‌ర‌కాయ‌, బెల్లం కూర‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

కాకరకాయ‌లు చేదుగా ఉంటాయి క‌నుక చాలా మంది వీటిని తినేందుకు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. ఈ కాయ‌ల‌తో కూర‌, కారం, పులుసు వంటివి చేసి తింటుంటారు. అయితే కాక‌ర‌కాయ కూర‌లో బెల్లం వేస్తే చేదు ఉండ‌దు. రుచిగా ఉంటుంది. కాస్త శ్ర‌మించాలే కానీ ఇంట్లోనే ఈ కూర‌ను ఎంతో రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే కాక‌ర‌కాయ, బెల్లం కూర‌ను ఎలా త‌యారు చేయాలో, దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు :

కాకరకాయలు.. 1/4 కిలో, ఉల్లిపాయలు 2, ఆవాలు.. 1/4 టీస్పూన్‌, జీలకర్ర.. 1/4 టీస్పూన్‌, కారం.. 1/4 టీస్పూన్‌, ఎండుమిర్చి 2, బెల్లం 100 గ్రా., చింతపండు గుజ్జు 3 టీస్పూన్లు, ఉప్పు తగినంత, నూనె సరిపడా.

this is how you can make kakarakaya bellam kura

తయారీ..

కాకరకాయలను ముక్కలుగా తరగాలి. ఈ ముక్కలమీద ఉప్పు చల్లి నీళ్లు పోసి ఉడికించాలి. తరువాత నీళ్లన్నింటినీ వార్చేయాలి. ఓ వెడల్పాటి బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇందులో ఉడికించిన కాకరకాయ ముక్కలు, ఉప్పు, కారం, బెల్లం వేసి నీరు ఆవిరయ్యేంతదాకా సన్నటి మంటమీద మగ్గించాలి. బెల్లం, పాకంలా మారి కాకరకాయ ముక్కలకు అంటుకున్న తరువాత చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు వేసి కలిపి కాసేపు ఉడికించి దించేయాలి.

Admin

Recent Posts