food

Ragi Sankati : అస‌లు సిస‌లైన రాగి సంక‌టి.. ఎలా త‌యారు చేయాలంటే..?

Ragi Sankati : రాగి సంగటి.. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో ఆరోగ్యకరమైన వంటకం. రాగి సంకటి పేరు వినని ఆహార ప్రియులు ఉండరని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.. రాయలసీమ స్పెషల్ అయిన రాగిసంగటికి తెలుగు వారంతా ఫ్యాన్సే.. ఎసిడిటీ, గ్యాస్ వంటి అనారోగ్య సమస్యలను దూరం చేసే రాగిసంగటిని లొట్టలేసుకుంటూ తింటుంటారు. రాగి సంగటిని రాగి ముద్దా, కాళి ముద్దా అని పిలుస్తారు.

ఇది ప్రధానంగా రాయలసీమ గ్రామీణ ప్రజలతో ప్రసిద్ది చెందింది. రాగి ముద్దా అనేక పోషకాలతో కూడిన స్టోర్ హౌస్ అని చెప్పవచ్చు. రాగిలో ఫైబర్, కాల్షియం మరియు ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.రాగి సంగటిని కనుక నాటుకోడి పులుసుతో ఆరగిస్తే దాని రుచి అదిరిపోతుంది. మరి రాగిసంగటిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

how to make ragi sankati know the recipe

రాగి సంకటికి కావలసిన పదార్థాలు 1 కప్పు రాగి పిండి, ½ కప్పు బియ్యం, 4 కప్పుల నీరు, ఉప్పు తగినంత. ఇప్పుడు ½ కప్పు బియ్యాన్ని కడిగి 15 నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టాలి. ఒక పాత్రలో నీరు పోసి మరిగించి, పాత్రలో నానబెట్టిన బియ్యం వేసి ఉప్పు వేయాలి. అన్నం బాగా ఉడికినంత వరకు ఉడికించాలి. రాగుల పిండిని బియ్యంపైన కుప్పగా వేసి, తక్కువ మంటలో ఉంచి, కదిలించకుండా వదిలివేయండి.

ఆ పాత్రను ఒక ప్లేట్‌ పెట్టి సుమారు 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి. ఆ తరువాత ప్లేట్‌ను తీసివేసి పిండి ముద్దలుగా లేకుండా అన్ని ముద్దలు సరిగ్గా కలిసే వరకు బాగా కలపాలి. ఇక వేడి వేడి రుచికరమైన రాగి సంగటిలో కించెం నెయ్యి వేసి ముద్దలుగా చుట్టుకోవాలి. అలాగే రాగి సంగటిని నాటి కోడి పులుసు, వంకాయ కూర మరియు వేరుశెనగ చట్నీతో కాని నంచుకొని తింటే దాన్ని రుచి అదిరిపోతుంది.

Admin

Recent Posts