హెల్త్ టిప్స్

Mint And Coriander Leaves : పుదీనా, కొత్తిమీర‌. రెండింటిలో మ‌న‌కు ఏది ఎక్కువ మేలు చేస్తుంది..?

Mint And Coriander Leaves : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా, ఆరోగ్యం పై శ్రద్ధ బాగా పెరిగింది. ఆరోగ్యంగా ఉండడం కోసం, అనేక రకాల ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. ఆరోగ్యానికి పుదీనా ఎంతో మేలు చేస్తుంది. ఆకుకూరలు దొరికే సీజన్లో కచ్చితంగా ఆకుకూరలని రెగ్యులర్ గా, తీసుకుంటూ ఉండండి. కొత్తిమీర, పుదీనా రెండిట్లో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండిట్లో కూడా యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. తాజాగా తీసుకోవచ్చు, లేదంటే మీరు కొత్తిమీరనైనా పుదీనానైనా నిల్వ పెట్టుకుని కూడా తీసుకోవచ్చు.

ఎండలో ఆరబెట్టేసి, నిల్వ చేసుకుని వాడుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవాళ్లు, కొత్తిమీరని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు కొత్తిమీరలో ఎక్కువ ఉంటాయి. అందువలన, ఆక్సికరణ ఒత్తిడి కారణంగా వచ్చే కారణాల డామేజ్ ని తగ్గిస్తుంది. శరీరంలో మంటని కూడా కొత్తిమీర తగ్గిస్తుంది. టోకోఫెరాల్స్ అలానే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువ ఉంటాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచగలవు.

mint and coriander leaves which one is healthy

కొత్తిమీర లో యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఉంటాయి. న్యూరో ప్రొటెక్టివ్ లక్షణాలు కూడా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. రక్త పోటుని కంట్రోల్ లో ఉంచుతుంది. గుండె సమస్యలకి కూడా దూరంగా ఉంచుతుంది. కొత్తిమీర లోని చక్కటి గుణాలు ఉంటాయి. ఆల్జీమర్స్ అభివృద్ధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొత్తిమీర పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించగలదు. జీర్ణశక్తి కూడా సహాయం చేస్తుంది.

యాంటీ మైక్రోబియన్ లక్షణాలు ఇందులో ఉంటాయి. ఇన్ఫెక్షన్లతో ఇది పోరాడుతుంది. పుదీనా కడుపు ఉబ్బరం, అతిసారం వంటి సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది. శ్వాస సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. నోటి దుర్వాసనను కూడా పోగొడుతుంది. ఇలా, ఈ రెండిటి వలన అనేక లాభాలు ఉన్నాయి. కాబట్టి, రెండిటిని కూడా రోజు తీసుకోవడం మంచిది.

Admin

Recent Posts