హైద‌రాబాద్‌లో కోవిడ్ వ్యాక్సిన్‌ల‌ను పంపిణీ చేసే హాస్పిట‌ల్స్ వివ‌రాలు ఇవే..!

మార్చి 1 నుంచి దేశ వ్యాప్తంగా రెండో ద‌శ కోవిడ్ టీకాల పంపిణీ కార్య‌క్ర‌మం ప్రారంభం కానున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే 60 ఏళ్ల వ‌య‌స్సు పైబ‌డిన వారితోపాటు 45 ఏళ్ల‌కు పైగా వ‌య‌స్సు ఉండి దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు క‌లిగిన వారికి కోవిడ్ టీకాల‌ను పంపిణీ చేయ‌నున్నారు. ప్ర‌భుత్వ హాస్పిట‌ళ్లు, కేంద్రాల్లో కోవిడ్ టీకాల‌ను ఉచితంగా ఇస్తారు. ప్రైవేటు హాస్పిట‌ల్స్‌లో అయితే ఒక్క డోసు టీకాకు రూ.250 చెల్లించాలి. ఇక హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేష‌న్ కేంద్రాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

list of covid vaccine centers in hyderabad

* ఏబీసీ హాస్పిట‌ల్
* అపోలో హాస్పిట‌ల్స్
* కేర్ హాస్పిట‌ల్స్
* గాయ‌త్రి విద్యా ప‌రిష‌త్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ మెడిక‌ల్ టెక్నాల‌జీ
* హెచ్‌సీజీ పినాకిల్ క్యాన్స‌ర్ సెంట‌ర్
* ఇండ‌స్ హాస్పిట‌ల్స్
* మ‌హాత్మా గాంధీ క్యాన్స‌ర్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్
* మైక్యూర్ హాస్పిట‌ల్స్ యూనిట్-1
* మైక్యూర్ హాస్పిట‌ల్స్ యూనిట్-2
* పినాకిల్ హాస్పిట‌ల్స్
* క్యూ1 హాస్పిట‌ల్స్
* సెవెన్ హిల్స్ హాస్పిట‌ల్
* స్టార్ పినాకిల్ హార్ట్ సెంట‌ర్
* విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్
* ల‌లిత సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్
* ఒమెగా హాస్పిట‌ల్స్
* ఆయుష్ ఎన్ఆర్ఐ ఎల్ఈపీఎల్ హెల్త్ కేర్
* అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ డ‌యాగ్న‌స్టిక్స్ ల్యాబొరేట‌రీ
* పుష్ప‌గిరి ఐ ఇనిస్టిట్యూట్
* మెడివిజ‌న్ ఐ అండ్ హెల్త్‌కేర్ సెంట‌ర్
* అర‌వింద్ ఐ హాస్పిటల్
* హైద‌రాబాద్ ఐ ఇనిస్టిట్యూట్ ఆప‌రేటింగ్ ట్ర‌స్ట్ ఆఫ్ ఎల్‌వీ ప్ర‌సాద్ ఐ ఇనిస్టిట్యూట్
* విరించి హాస్పిట‌ల్స్
* నెఫ్రోప్ల‌స్ బంజారాహిల్స్ సెంట‌ర్
* మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్స్

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ (https://www.mohfw.gov.in/) ను సంద‌ర్శించ‌డం ద్వారా మ‌రిన్ని హాస్పిట‌ల్స్ వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు. వాటిల్లో కోవిడ్ వ్యాక్సిన్‌ను ఇస్తారు.

Admin

Recent Posts