Winter : గత వారం రోజుల నుంచి దేశంలో చలితీవ్రత బాగా పెరిగింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. మరికొద్ది రోజుల పాటు ఇలాగే ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణలోని 8 జిల్లాలకు ఆ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.
తెలంగాణలోని ఆసిఫాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నారాయణపేట్, మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు దిగువకు చేరుకున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్రజలు చలి తీవ్రతతోపాటు వైరస్ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందేందుకు వాతావరణంతో సంబంధం లేదు. ఎలాంటి వాతావరణంలో అయినా సరే ఆ వైరస్ వ్యాప్తి చెందుతుంది. కానీ చలి వాతావరణం ఉంటే మాత్రం ఇంకాస్త ఎక్కువగానే వైరస్ వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ గత వేరియెంట్‌ల కన్నా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కనుక.. చలి తీవ్రత ఎక్కువగా ఉంది కనుక.. ఈ వైరస్ కేసులు మరిన్ని పెరిగేందుకు అవకాశం ఉందని అంటున్నారు.
కనుక బయటకు వెళ్లేవారు కచ్చితంగా జాగ్రత్తలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్కులను ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులను శానిటైజర్ లేదా హ్యాండ్ వాష్‌తో శుభ్రం చేసుకోవడం.. వంటి పనులు చేయాలని అంటున్నారు. లేదంటే వైరస్ బారిన పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.