Guava : జామ పండ్ల‌ను తింటే క‌లిగే అతి పెద్ద లాభాలివే.. ఇవి మీకు తెలుసా..?

Guava : మ‌న‌కు విరివిగా ల‌భించే పండ్ల‌ల్లో జామ‌పండు కూడా ఒక‌టి. జామ‌పండును ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. జామ‌పండు మ‌న‌కు సంవ‌త్స‌రం పొడ‌వునా ల‌భిస్తుంది. అలాగే చాలా త‌క్కువ ధ‌ర‌లో ఇది ల‌భిస్తూ ఉంటుంది. జామ‌పండు రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతోమేలు క‌లుగుతుంది. రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ జామ‌పండును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. జామ‌పండులో ఆస్కార్బిక్ యాసిడ్, విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి ఉంటుంది.

త‌రుచూ వైర‌స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డే వారు జామ‌పండును తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే దీనిలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక దీనిని తీసుకోవ‌డం వల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. అదే విధంగా బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి జామ‌పండు ఎంతో మేలు చేస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. దీనిలో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. అలాగే దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. దీంతో మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఇక డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారు క‌డా జామ‌పండును తీసుకోవ‌డం వ‌ల్ల ఎంతో మేలు క‌లుగుతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలను అదుపులో ఉంచ‌డంలో ఇది మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. జామ‌కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ప్రేగులు శుభ్ర‌ప‌డ‌తాయి.

5 big advantages of having guava daily
Guava

దీంతో మ‌న శ‌రీర ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. అదే విధంగా జామ‌పండులో పొటాషియం ఎక్కువ‌గా ఉంటుంది. ఇది ర‌క్త‌పోటును అదుపులో ఉంచడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా స‌హాయ‌ప‌డుతుంది. ఈ పండులో ఉండే విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది. అంతేకాకుండా జామ‌పండును తీసుకోవ‌డం వ‌ల్ల‌శ‌రీరంలో వ్య‌ర్థాలు తొల‌గిపోతాయి. క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డ‌కుండా ఉంటాము. ఈ విధంగా జామకాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని రోజూ ఒక‌టి లేదా రెండు చొప్పున తీసుకోవ‌డం వ్ల‌ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts