Laal Maas : పూర్వం రోజుల్లో వండుకున్న మ‌ట‌న్ క‌ర్రీ.. ఇలా చేస్తే సూప‌ర్‌గా ఉంటుంది..!

Laal Maas : మ‌న‌కు రాజ‌స్థానీ రెస్టారెంట్ ల‌లో, హోటల్స్ లో ల‌భించే నాన్ వెజ్ వంట‌కాల్లో లాల్ మాస్ కూడా ఒక‌టి. రాజుల కాలంలో వేటాడిన మాంసంతో ఈ లాల్ మాస్ ను త‌యారు చేసేవారు. ఇప్పుడు అదే రుచితో, అదే పేరుతో మ‌ట‌న్ తో దీనిని త‌యారు చేస్తూ ఉంటారు. లాల్ మాస్ చాలా రుచిగా,క‌ల‌ర్ ఫుల్ గా ఉంటుంది. రాజ‌స్థానీ వంట‌క‌మైన ఈ లాల్ మాస్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. మొద‌టిసారి చేసే వారు కూడా కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల చాలా చ‌క్క‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో క‌మ్మ‌గా, రుచిగా ఉండే లాల్ మాస్ ను ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

లాల్ మాస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కాశ్మీరి మిర్చి – 7, ఎండుమిర్చి – 15, లేత మ‌ట‌న్ – ముప్పావు కిలో, ఆవాల నూనె – 6 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకులు – 2, యాల‌కులు – 5, ల‌వంగాలు – 5, న‌ల్ల యాల‌కులు – 2, మిరియాలు -ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, స‌న్న‌గా పొడవుగా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియ‌ల పొడి – 3 టేబుల్ స్పూన్స్, గ‌రం మ‌సాలా – ఒక టేబుల్ స్పూన్, వేడి నీళ్లు – త‌గిన‌న్ని, చిలికిన పెరుగు – అర క‌ప్పు, నెయ్యి – 2 టీ స్పూన్స్.

Laal Maas recipe in telugu make mutton in this way
Laal Maas

లాల్ మాస్ త‌యారీ విధానం..

ముందుగా మిర్చీల‌ను గిన్నెలో తీసుకుని అందులో వేడి నీటిని పోసి అర‌గంట పాటు నాన‌బెట్టాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత అడుగు మంద‌గా ఉండే గిన్నెలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి ఎర్ర‌గా అయిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని చ‌క్క‌గా వేయించిన త‌రువాత మ‌ట‌న్ వేసి క‌ల‌పాలి. మ‌ట‌న్ లోని నీరంతా పోయి నూనె పైకి తేలిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఉప్పు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి.

దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు మూత పెట్టి చిన్న మంట‌పై 20 నుండి 30 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత పెరుగు, నెయ్యి, మ‌రికొద్దిగా నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు మ‌ర‌లా మూత పెట్టి మ‌రో 10 నిమిషాల పాటు ఉడికించాలి. మ‌ట‌న్ చ‌క్క‌గా ఉడికి నూనె పైకి తేలిన త‌రువాత స్టవ్ ఆఫ్ చేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే లాల్ మాస్ త‌యార‌వుతుంది. దీనిని చ‌పాతీ, రోటీ, పులావ్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. మ‌ట‌న్ క‌ర్రీని త‌రుచూ ఒకేరకంగా కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts