Dukka Rotte : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం ఇది.. బ‌లాన్నిస్తుంది.. ఎలా చేయాలంటే..?

Dukka Rotte : దుక్క రొట్టె.. మిన‌ప‌ప్పుతో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. పూర్వ‌కాలంలో దీనిని ఎక్కువ‌గా త‌యారు చేసేవారు. అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో బ‌లం క‌లుగుతుంది. పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు దీనిని ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. వెరైటీ రుచుల‌ను కోరుకునే వారు వెరైటీ వంట‌లు త‌యారు చేయాల‌నుకునే వారు ఈ దుక్క రొట్టెను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ దుక్క రొట్టెను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్న అందించే ఈ దుక్క రొట్టెను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

దుక్క రొట్టె త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పొట్టు మిన‌ప‌ప్పు – అర క‌ప్పు, పాలిష్ చేయ‌ని బియ్యం – ఒక‌టిన్న‌ర క‌ప్పు, పెరుగు – ఒక క‌ప్పుప‌చ్చిమిర్చి – 3, అల్లం – ఒక చిన్న ముక్క‌, ఇంగువ – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌, నీళ్లు – త‌గిన‌న్ని, ఉప్పు – త‌గినంత‌.

Dukka Rotte recipe in telugu very healthy and tasty
Dukka Rotte

దుక్క రొట్టె త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో మిన‌ప‌ప్పు వేసి ర‌వ్వ లాగా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అదే జార్ లో బియ్యం కూడా వేసి ర‌వ్వ‌లాగా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో పెరుగు వేసి క‌ల‌పాలి.త‌రువాత ప‌చ్చిమిర్చిని, అల్లాన్ని దంచి వేసుకోవాలి. త‌రువాత ఇంగువ‌, జీల‌క‌ర్ర‌, క‌రివేపాకు త‌రుగు, త‌గిన‌న్ని నీళ్లు పోసి క‌ల‌పాలి.దీనిపై మూత పెట్టి రాత్రంతా పులియ‌బెట్టాలి. త‌రువాత పిండిలో ఉప్పు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే చిన్న క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత త‌యారు చేసుకున్న పిండిని వేసి పైన స‌మానంగా చేసుకోవాలి. దీనిపై మూత పెట్టి ఆవిరి బ‌య‌ట‌కు పోయేలా కొద్దిగా సందును ఉంచి చిన్న మంట‌పై 10 నిమిషాల వేయించాలి.

త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి పూర్తిగా చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత దీనిని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో మ‌రి కొద్దిగా నూనె వేసి మ‌రో వైపుకు తిప్పుకుని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకోవాలి. త‌రువాత ప్లేట్ లోకి తీసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దుక్క రొట్టె త‌యార‌వుతుంది. దీనిని ఏ చ‌ట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts