మన శరీరంలో లివర్ ఓ ముఖ్యమైన అవయవం. ఇది ఎన్నో విధులను నిర్వర్తిస్తుంది. మన శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది. అయితే లివర్ సమస్యలు వచ్చిన వారు లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పలు సూచనలను పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మద్యం అధికంగా సేవించడం వల్ల లివర్ ఎక్కువగా శ్రమిస్తుంది. లివర్‌లో కొవ్వు పేరుకుపోయి లివర్ దెబ్బ తినేందుకు అవకాశం ఉంటుంది. కనుక మద్యం సేవించడం మానేయాలి. దీని వల్ల లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
2. అధిక బరువు ఉన్నవారిలోనూ లివర్ సమస్యలు వస్తుంటాయి. కనుక బరువును తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీని వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
3. కొవ్వు పదార్థాలు, తీపి పదార్థాలు, ఇతర జంక్ ఫుడ్, నూనె పదార్థాలను ఎక్కువగా తింటే లివర్‌పై భారం పడుతుంది. అందువల్ల వాటిని తీసుకోవడం తగ్గించాలి. లేదా మానేయాలి.
4. రోజూ వ్యాయామం చేయడం వల్ల లివర్ ఆరోగ్యగాన్ని మెరుగు పరుచుకోవచ్చు. వ్యాయామానికి సమయం లేదని భావించేవారు కనీసం యోగా లేదా 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేస్తుండాలి.
5. ద్రాక్షలు, బీట్ రూట్, నట్స్, చేపలు, ఆలివ్ నూనె వంటి ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.