సాధారణ జలుబు కావచ్చు, కరోనా వైరస్ కావచ్చు.. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం అత్యంత ఆవశ్యకం. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే అన్ని రకాల వైరల్, ఫంగల్, బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి సురక్షితంగా ఉండవచ్చు. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి.
సైంటిస్టుల పరిశోధనల ప్రకారం ప్రపంచంలో ఇప్పటి వరకు 5000 కు పైగా భిన్న రకాల వైరస్‌లను గుర్తించారు. వాటిల్లో చాలా వరకు వైరస్‌లు తీవ్ర అనారోగ్య సమస్యలను కలగజేస్తాయి. ముందుగా చిన్న ఇన్‌ఫెక్షన్‌తో మొదలై చివరకు ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడేలా చేస్తాయి. కరోనా వైరస్ శ్వాసకోశ వ్యవస్థలో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ను కలగజేస్తుందని అందరికీ తెలిసిందే. అందువల్ల ఇన్‌ఫెక్షన్ వేగంగా వ్యాప్తి చెందకుండా చూసుకోవాలి. అందుకు గాను యాంటీ వైరల్ లక్షణాలు కలిగిన ఆహారాలను రోజూ తీసుకోవాలి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కోవిడ్ సోకిన వారు త్వరగా కోలుకుంటారు.
1. తులసి దాదాపుగా భారతీయులందరి ఇళ్లలోనూ ఉంటుంది. తులసిలో భిన్న రకాలు ఉన్నాయి. అవి యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. రోజూ కొన్ని తులసి ఆకులను నములుతుంటూ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లపై అవి పోరాడుతాయి. తులసి ఆకుల్లో అపిగెనిన్, ఉర్సోలిక్ యాసిడ్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి హెర్పిస్ వైరస్‌లు, హెపటైటిస్ బి, ఎంటెరోవైరస్‌లకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. దీంతో ఆయా వ్యాధుల నుంచి బయట పడవచ్చు.
2. సోంపు గింజల్లో ట్రాన్స్-అనెథోల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది హెర్పెస్ వైరస్‌లపై అద్భుతంగా పనిచేస్తుంది. సోంపు గింజలను తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వాపులు తగ్గుతాయి. వైరస్ ఇన్‌ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు. ఈ గింజల్లో విటమిన్ ఎ, సి, బీటా కెరోటిన్‌లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సోంపు గింజలను రోజూ తినడంవల్ల సైనస్ క్లియర్ అవుతుంది. శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
3. అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. ఇన్‌ఫ్లుయెంజా ఎ, బి, హెచ్ఐవీ, హెచ్ఎస్‌వీ-1, వైరల్ న్యుమోనియా, రైనో వైరస్ వంటి ఇన్‌ఫెక్షన్లపై వెల్లుల్లి బాగా పనిచేస్తుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. వెల్లుల్లిలో ఆల్లిసిన్ అనబడే సమ్మేళనం ఉంటుంది. అందువల్లే వెల్లుల్లికి ఔషధ గుణాలు ఉంటాయి. దీని వల్లే వెల్లుల్లి ఘాటు వాసన, రుచిలను కలిగి ఉంటుంది. వెల్లుల్లిల సహజసిద్దమైన ఆర్గానో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వైరల్ ఇన్‌ఫెక్షన్లను అడ్డుకుంటాయి. ఇన్‌ఫెక్షన్ ను తీవ్రతరం కాకుండా చూస్తాయి.
4. అనేక అనారోగ్య సమస్యలను తగ్గించే సూపర్ ఫుడ్‌గా అల్లంను చెప్పవచ్చు. ఇందులో అద్భుతమైన యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. దీని వల్ల ఇన్‌ఫ్లుయెంజా, ఆర్ఎస్‌వీ, ఫిలైన్ కాలిసివైరస్ వంటి ఇన్‌ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు. అల్లంలో జింజరాల్స్, జింజరోన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో వైరస్‌లను వృద్ధి చెందనీయవు. ఫలితంగా ఇన్‌ఫెక్షన్ త్వరగా తగ్గుతుంది. అల్లంతో తయారు చేసే డికాషన్‌ను తాగినా లేదా అల్లం రసంను నేరుగా తీసుకున్నా ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
5. భారతీయులు నిత్యం పసుపును రక రకాల వంటల్లో వేస్తుంటారు. ఇందులో అనేక సమ్మేళనాలు ఉంటాయి. అవి పసుపుకు ఔషధ గుణాలను అందిస్తాయి. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అలాగే పసుపులో యాంటీ వైరల్ లక్షణాలు కూడా ఉంటాయి. దీంతో పలు రకాల వైరస్‌లు నాశనం అవుతాయి. ఇన్‌ఫెక్షన్ తీవ్రత తగ్గుతుంది. రోజూ పసుపును ఆహారంలో భాగం చేసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వైరస్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365