శ‌రీరంలోని అధిక శ్లేష్మాన్ని క‌రిగించాలంటే ఈ హెర్బ‌ల్ టీని తాగాలి..!

కోవిడ్ 19 శ్వాస కోశ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన వ్యాధి అని అంద‌రికీ తెలిసిందే. ఈ వ్యాధి బారిన ప‌డితే ఊపిరితిత్తులు, గొంతు, ముక్కుల‌లో ఇన్‌ఫెక్ష‌న్ ఉంటుంది. అందువ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్ తీవ్ర‌త‌రం కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ప‌లుర‌కాల శ్వాస వ్యాయామాలు చేయ‌డం, హెర్బ‌ల్ టీ లు తాగ‌డం చేస్తే ఇన్‌ఫెక్ష‌న్‌ను త‌గ్గించుకోవ‌చ్చు. దీంతో కోవిడ్ నుంచి త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌సాలా దినుసుల‌తో త‌యారు చేసే హెర్బ‌ల్ టీల‌ను తాగితే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీంతోపాటు ఊపిరితిత్తుల్లో ఉండే మ్యూక‌స్ (శ్లేష్మం) క‌రుగుతుంది. దీని వ‌ల్ల ఇన్ఫెక్ష‌న్ త్వ‌ర‌గా త‌గ్గుతుంది. కోవిడ్ నుంచి త్వ‌ర‌గా కోలుకుంటారు.

drink this herbal tea to reduce excess mucus in body

ఊపిరితిత్తుల్లో ఉండే అధిక శ్లేష్మంను త‌గ్గించుకునేందుకు కింది ప‌దార్థాలతో త‌యారు చేసే హెర్బ‌ల్ టీ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దాన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్లేష్మంను తగ్గించే హెర్బ‌ల్ టీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్ధాలు

  • తురిమిన అల్లం – కొద్దిగా
  • దాల్చిన చెక్క – 1 చిన్న ముక్క
  • తుల‌సి ఆకులు – అర టీస్పూన్
  • న‌ల్ల మిరియాలు – 3
  • యాల‌కులు – 2
  • సోంపు గింజ‌లు – పావు టీస్పూన్
  • వాము – చిటికెడు
  • జీల‌కర్ర – పావు టీస్పూన్

హెర్బ‌ల్ టీ ని తయారు చేసే విధానం

ఒక పాత్ర తీసుకుని అందులో గ్లాస్ నీటిని పోయాలి. అనంత‌రం అందులో అన్ని ప‌దార్థాల‌ను వేసి బాగా మ‌రిగించాలి. నీరు స‌గం అయ్యే వ‌ర‌కు మ‌రిగించాక స్ట‌వ్ ఆర్పి డికాష‌న్‌ను వ‌డ‌క‌ట్టాలి. అందులో అవ‌స‌రం అనుకుంటే తేనె, నిమ్మ‌ర‌సం క‌లుపుకోవ‌చ్చు. ఈ హెర్బ‌ల్ టీని రోజుకు రెండు సార్లు తాగాలి. ప్రాణాయామం, శ్వాస వ్యాయామాలు చేయ‌డంతోపాటు ఈ హెర్బ‌ల్ టీని రోజుకు రెండు సార్లు తాగ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల్లో ఉండే శ్లేష్మం క‌రుగుతుంది. దీని వ‌ల్ల కోవిడ్ నుంచి త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చు. ఇన్‌ఫెక్ష‌న్ తీవ్ర‌త‌రం కాకుండా ఉంటుంది.

మ‌న వంట ఇళ్ల‌లో అందుబాటులో ఉండే స‌హజ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో ఈ హెర్బ‌ల్ టీ ని త‌యారు చేస్తారు, క‌నుక రోగ నిరోధక శ‌క్తి పెరుగుతుంది. ఈ టీ త‌యారీకి ఉప‌యోగించే ప‌దార్థాల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ బాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల రోగాల నుంచి సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు.

గ‌ర్భిణీలు, పాలిచ్చే త‌ల్లులు డాక్ట‌ర్ స‌ల‌హా మేర‌కు ఈ హెర్బ‌ల్ టీని తాగాలి. ఎందుకంటే ఇందులో మ‌సాలాలు అధికంగా ఉంటాయి. ఇవి స‌మ‌స్య‌ల‌ను క‌లిగించ‌వ‌చ్చు. ఈ టీని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలోని విష ప‌దార్థాలు కూడా బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. శ‌రీరం శుభ్రంగా మారుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts