Cardamom : చాలా మంది యాలకులని వాడుతూ ఉంటారు. యాలకులని తీసుకోవడం వలన అనేక రకాల లాభాలను పొందడానికి అవుతుంది. చాలా మంది వంటల్లో యాలకులని వేస్తూ వుంటారు. ముఖ్యంగా స్వీట్స్ లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఎన్నో సమస్యలకి దూరంగా ఉండడానికి యాలకులని తీసుకోవచ్చు. ప్రతి ఒక్క మనిషికి కూడా నిత్యం ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది.
ఎన్నో అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికీ కలుగుతూనే ఉంటాయి. ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. ఈరోజుల్లో చాలామంది డయాబెటిస్ వస్తే త్వరగా చనిపోతారని అనుకుంటున్నారు. కానీ నిజమైతే అది కాదు. షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం చక్కగా జీవించొచ్చు. నూరేళ్లు జీవించిన వాళ్లు కూడా ఉన్నారు. అందరిలాగానే వాళ్లు కూడా ఆరోగ్యంగా, యాక్టివ్ గా ఉండొచ్చు.
జీవన శైలిలో మార్పుల వల్ల వచ్చే అనారోగ్యం ఈ షుగర్. షుగర్ ఒక్కటే కాదు మన జీవనశైలిలో మార్పుల వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మనం కనుక లైఫ్ స్టైల్ ని మార్చుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు. మనం తినే, తాగే ఆహార పదార్థాలలో కొంచెం మార్పులు చేసుకుంటూ ఉండాలి. యాలకులు బాగా ఉపయోగపడతాయి.
యాలకులని ఒక దివ్య ఔషధంగా భావిస్తారు. ఎక్కువ మంది వీటిని ప్రతి రోజు తీసుకుంటూ ఉంటారు. యాలకులలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే పూర్వీకులు వీటిని ఎక్కువగా ఉపయోగించేవారు. వీటిలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, మినరల్స్ వంటి పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మల్టీ విటమిన్ టాబ్లెట్ లాగా ఇది పనిచేస్తుంది. నోటి నుండి దుర్వాసన కూడా రాకుండా చేస్తుంది. రోజంతా నోటి నుండి దుర్వాసన రాకుండా, నోరంతా ఫ్రెష్ గా ఉంటుంది. రోజూ వీటిని ఒకటి లేదా రెండు తింటే ఎన్నో లాభాలను పొందవచ్చు.