Active Brain : మెద‌డు చురుగ్గా ఉండి జ్ఞాప‌క‌శ‌క్తి పెర‌గాలంటే.. వీటిని తీసుకోవాలి..!

Active Brain : ఏ వ్య‌క్తి అయిన చురుకుగా ముందుకు దూసుకుపోవాలంటే శ‌రీరం ఆరోగ్యంగా ఉండ‌డంతో పాటు మాన‌సికంగా కూడా ధృడంగా ఉండాలి. అలా ఉండాలంటే ముందుగా మ‌న మెద‌డును చురుకుగా ఉంచుకోవాలి. స‌రైన ఆహార ప‌దార్థాలు తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు చురుకుగా ప‌ని చేస్తుంది. జ్ఞాప‌క శక్తి పెరుగుతుంది. మెద‌డు చురుకుగా ఉండ‌డంతో పాటు మెద‌డు ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే ఆహార ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెద‌డు జ్ఞానేంద్రియాల‌న్నింటికి ముఖ్య‌మైన కేంద్రం. మెద‌డు చెప్పిన విధాంగానే మ‌న శ‌రీరం న‌డుచుకుంటుంది. కాబ‌ట్టి మెద‌డు చురుకుగా ఉన్నంత కాలం మ‌న శ‌రీరం చురుకుగా ఉంటుంది. దాంతో ఆరోగ్యం కూడా చ‌క్క‌గా ఉంటుంది. మెద‌డు ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే ఆహారాల్లో వాల్ న‌ట్స్ ఒక‌టి. వీటిలో ఉండే ఫాలీఫినాల్స్ న్యూరాన్స్ మ‌రియు మెద‌డు మ‌ధ్య స‌మాచార వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి చేస్తుంది.

వాల్ నట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల జ్ఞాప‌క శ‌క్తిని మెరుగుప‌రుచుకునే అవ‌కాశం ఉంది. అలాగే అవిసె గింజ‌లు చూడ‌డానికి చాలా చిన్న‌గా ఉంటాయి. కానీ ఇవి మెద‌డు ఆరోగ్యాన్ని, మెద‌డు ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిని పెరుగు లేదా ఇత‌ర ఆహార ప‌దార్థాల‌తో క‌లిపి తీసుకోవ‌చ్చు. ధాన్యంతో త‌యారు చేసిన ఆహారాలు, చిరు ధాన్యాలు, క్వినోవా వంటివి మెద‌డుకు అద్భుత‌మైన ఆహారాలుగా ప‌ని చేస్తాయి. అదేవిధంగా ఓట్స్ లో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. మెద‌డుకు కావ‌ల్సిన శ‌క్తిని అందించ‌డంలో ఇవి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. ఒక క‌ప్పు ఓట్స్ ను మ‌రియు పండ్లు క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల జ్ఞాప‌క శ‌క్తి పెర‌గ‌డంతో పాటు ఏకాగ్ర‌త కూడా పెరుగుతుంది. శ‌రీరం మొత్తం విస్త‌రించి ఉన్న ర‌క్త‌నాళాల‌కు అలాగే మెద‌డుకు అవ‌స‌ర‌మ‌య్యే మెగ్నీషియం ఆక‌కూర‌ల్లో పుష్క‌లంగా ఉంటుంది.

Active Brain health tips in telugu take these foods
Active Brain

మెద‌డు ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూర‌ల‌ను తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. తాజా పుదీనా వాస‌న మెద‌డు ప‌నితీరు పెర‌గ‌డానికి, చురుకుగా ఉండ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. అదే విధంగా ట‌మాటాల్లో ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మెద‌డు ప‌ని తీరును దెబ్బ‌తీసే ఫ్రీ రాడిక‌ల్స్ ను న‌శింప‌జేసే శ‌క్తిని క‌లిగి ఉంటుంది. క‌నుక ట‌మాటాల‌ను కూడా రోజు వారి ఆహారంలో తీసుకోవ‌డం చాలా ముఖ్యం. అర‌టి పండ్లలో మెద‌డు పెరుగుద‌లకు అవ‌స‌ర‌మ‌య్యే మాంగ‌నీస్ పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల అర‌టి పండ్ల‌ను త‌ర‌చూ తింటూ ఉండాలి. ఉద‌యం అల్పాహారం త‌ప్ప‌కుండా తీసుకోవాలి. అల్పాహారం తీసుకోవ‌డం వ‌ల్ల జ్ఞాప‌క శ‌క్తి పెర‌గ‌డంతో పాటు రోజు వారి కార్య‌క్ర‌మాలు చురుకుగా చేసుకోవ‌చ్చు. చేప‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ‌గా ఉంటాయి. మెద‌డును చురుకుగా ఉంచ‌డంలో చేప‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

వీటిని త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు ప‌నితీరు మెరుగుప‌డుతుంది. కాఫీలోని కెఫిన్ మెద‌డుకు శ‌క్తిని ఇస్తుంది. కానీ కెఫిన్ ను అధికంగా తీసుకోవ‌డం ఆరోగ్యానికి మంచిది కాదు క‌నుక ఒక‌టి లేడా రెండు క‌ప్పుల కంటే ఎక్కువ కాఫీని తీసుకోకుండా జాగ్ర‌త్త ప‌డాలి. మెద‌డు చురుకుగా ఉండాలంటే నీరు చాలా అవ‌స‌రం. కాబ‌ట్టి ప్ర‌తిరోజూ 8 గ్లాసుల నీటిని త‌ప్ప‌కుండా తీసుకోవాలి. పాలు, పాల సంబంధిత ప‌దార్థాలు, బాదం ప‌ప్పు వంటి వాటిని తీసుకున్నా కూడా మెద‌డు ఆరోగ్యం, ప‌నితీరు మెరుగుప‌డుతుంది. చ‌క్క‌టి ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు చురుకుగా ఉంటుంది. జ్ఞాప‌క శ‌క్తి పెరుగుతుంది. త‌ద్వారా మ‌నం కూడా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. ఈ ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వృద్ధాప్యంలో వ‌చ్చే మ‌తిమ‌రుపు వంటి మెద‌డు సంబంధిత స‌మ‌స్య‌ల నుండి దూరంగా ఉండ‌వ‌చ్చు. ఈ ఆహారాలు మెద‌డుతో పాటు శ‌రీరానికి ఆరోగ్యానికి కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

D

Recent Posts