హెల్త్ టిప్స్

వ్యాయామం చేసిన వారు ఈ టీల‌ను తాగితే ఎంతో మేలు చేస్తాయి..!

టీ తాగడం ఆరోగ్యానికి హానికరమనుకుంటే మీ భావాలను మార్చుకోండి. వర్కవుట్లకు ముందు తర్వాత కూడా నాలుగు రకాల టీ తాగవచ్చు. అవి గ్రీన్ టీ, బ్లాక్ టీ, హెర్బల్ టీ, జింజర్ టీ. ఆరోగ్యవంతంగా, శక్తితో వుండాలంటే ఈ నాలుగు చాయ్ లు తాగేయవచ్చని నిపుణులు చెపుతున్నారు. వ్యాయామం తర్వాత తాగే టీ ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. గ్రీన్ టీ – ఇది ఒక మంచి హెర్బల్ టీ. బరువు తగ్గుతారు. కొవ్వు తగ్గాలన్నా, శక్తితో వుండాలన్నా ఇది మంచిది. ఇందులో వుండే కేఫైన్ బరువు తగ్గిస్తుంది.

వ్యాయామం తర్వాత గ్రీన్ టీ తాగితే మెటబాలిజం బాగా జరిగి కేలరీలు అధికంగా వ్యయం అవుతాయి. బ్లాక్ టీ: దీనిని వ్యాయామం తర్వాత తాగితే శక్తి పుంజుకోవచ్చు. రోజంతా చురుకుగా వుంటారు. నైట్రిక్ యాసిడ్ లెవెల్ పెరిగి బలాన్ని పొంది వెయిట్ లిఫ్టింగ్ వంటివి తేలికగా చేయగలరు. జింజర్ టీ: వర్కవుట్ల తర్వాత జింజర్ టీ తాగితే సహజమైన మెడిసిన్ లా పనిచేస్తుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. జీర్ణక్రియ పెరుగుతుంది. కనుక కండల నొప్పులు తగ్గాలంటే జింజర్ టీ మంచిది.

after exercise take these herbal teas for many benefits

హెర్బల్ టీ: తీపిలేని, ఐస్ వేసిన టీ వ్యాయామం తర్వాత తాగితే బాడీ ఎనర్జీ స్ధాయి పెరిగి శరీరం చల్లగా వుంటుంది. దీనిలో కేలరీలు తక్కువ. స్ట్రెచింగ్ లేదా కార్డియో వర్కవుట్లు చేసేవారికి ఇది సూచించదగినది. కనుక మీ వర్కవుట్ల తర్వాత ఫిట్, ఆరోగ్యం, చురుకుదనం పొందడానికి పైన తెలుపబడిన టీలు తాగి మరింత శక్తి సామర్ధ్యాలను పొందండి.

Admin

Recent Posts