Almonds And Sesame : రోజుకు రెండు పూట‌లా వీటిని తిన్నారంటే చాలు.. 100 ఏళ్లు వ‌చ్చినా ఎముక‌లు ఉక్కులా ఉంటాయి..!

Almonds And Sesame : మ‌నం ఎక్కువ‌గా ప‌ని చేసిన‌ప్పుడు అల‌స‌ట‌, నీర‌సం, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటివి వాస్తూ ఉంటాయి. కానీ ఈ నొప్పులు, నీర‌సం వంటివి ప్ర‌తిరోజూ ఇబ్బంది పెడుతూ ఉంటే మ‌న శ‌రీరంలో క్యాల్షియం లోపించిన‌ట్టుగా భావించాలి. ఈ క్యాల్షియం లోపం కేవ‌లం పెద్ద వారిలోనే కాకుండా పిల్ల‌లో కూడా తలెత్తుతుంది. క్యాల్షియం లోపించ‌డం వ‌ల్ల నొప్పుల‌తో పాటు న‌డిచేట‌ప్పుడు మోకాళ్ల నుండి శ‌బ్దాలు కూడా వ‌స్తాయి. శ‌రీరానికి ఎండ త‌గ‌ల‌క‌పోవ‌డం, పోష‌కాహార లోపం, మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు, ఆమ్ల‌త‌త్వం ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత శ‌రీరంలో క్యాల్షియం లోపం త‌లెత్తుతుంది. ఈ స‌మ‌స్య‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం వ‌ల్ల ఎముక‌లు బ‌ల‌హీన‌ప‌డ‌డంతో పాటు కంటి స‌మ‌స్య‌లు, జుట్టు మ‌రియు చ‌ర్మం దెబ్బ‌తిన‌డం వంటివి జ‌రుగుతాయి.

పూర్వ‌కాలంలో పెద్ద వారిలో మాత్ర‌మే వ‌చ్చే ఈ మోకాళ్ల నొప్పులు నేడు యువ‌త‌లో కూడా క‌నిపిస్తున్నాయి. క‌నుక ఈ స‌మ‌స్య‌ను మ‌నం ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి క్యాల్షియం స‌ప్లిమెంట్స్ ను తీసుకుంటూ ఉంటారు. క్యాల్షియం స‌ప్లిమెంట్స్ ను తీసుకునే పని లేకుండా కేవ‌లం మ‌న ఇంట్లో ప‌దార్థాల‌తో ఒక పొడిని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం క్యాల్షియం లోపాన్ని అధిగ‌మించ‌వ‌చ్చు. ఎముక‌ల‌ను ధృడంగా, ఆరోగ్యంగా మార్చుకోవ‌చ్చు. క్యాల్షియం లోపాన్ని త‌గ్గించే ఈ చిట్కాను ఎలా త‌యారు చేసుకోవాలి…ఎలా వాడాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం మ‌నం బాదం ప‌ప్పును, నువ్వుల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది.

Almonds And Sesame for strong bones and healthy life
Almonds And Sesame

ముందుగా ఒక గిన్నెలో 4 లేదా 5 బాదం ప‌ప్పుల‌ను వేసి రాత్రంతా నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే ఈ బాదం ప‌ప్పుల‌కు ఉండే పొట్టును తీసి వాటిని బాగా న‌మిలి తినాలి. త‌రువాత ఒక గ్లాస్ పాల‌ను తాగాలి. అలాగే సాయంత్రం పూట ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ నువ్వుల పొడిని క‌లిపి ఆ నీటిని తాగాలి. నీటిలో క‌లిపి తాగ‌డం ఇష్టం లేని వారు నువ్వుల పొడిని తిని నీటిని తాగాలి. స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉన్న వారు రెండు టీ స్పూన్ల పొడిని కూడా క‌లిపి తీసుకోవ‌చ్చు. ఈ విధంగా పాలు, బాదం ప‌ప్పు, నువ్వుల పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల క్యాల్షియం త‌గ్గుతుంది. ఎముక‌లు ధృడంగా, ఆరోగ్యంగా త‌యార‌వుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు త‌గ్గుతాయి. క్యాల్షియంతో పాటు శ‌రీరానికి కావ‌ల్సిన ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి.

మ‌నం రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను ఈ విధంగా వాడ‌డం వ‌ల్ల క్యాల్షియం లోపం త‌గ్గ‌డంతో పాటు భ‌విష్య‌త్తులో కూడా రాకుండా ఉంటుంది. దీనిని వాడిన మూడు రోజుల్లోనే మ‌నం మ‌న శ‌రీరంలో వ‌చ్చే మార్పును గ‌మ‌నించ‌వ‌చ్చు. క్యాల్షియం లోపంతో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల అద్భుత ఫ‌లితాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు.

D

Recent Posts