Night Bath : రాత్రి నిద్రించే ముందు స్నానం చేయండి.. ఆ కార్యంలో చురుగ్గా పాల్గొంటారు.. ఇంకా ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

Night Bath : సాధార‌ణంగా ఉద‌యం చాలా మంది కాల‌కృత్యాలు తీర్చుకుని దంతాల‌ను తోముకున్న త‌రువాత స్నానం చేస్తుంటారు. త‌రువాత ఆఫీసుల‌కు వెళ్ల‌డ‌మో, ఇత‌ర ప‌నులు చేయ‌డ‌మో చేస్తుంటారు. ఇక కొంద‌రు బ‌య‌ట తిరిగి వ‌చ్చేవారు సాయంత్రం ఇంటికి రాగానే స్నానం చేస్తుంటారు. అయితే వాస్త‌వానికి రాత్రి నిద్ర‌కు ముందు కూడా స్నానం చేయాలి. దీంతో అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

amazing health benefits of Night Bath
Night Bath

1. రాత్రి నిద్ర‌కు ముందు స్నానం చేయ‌డం వ‌ల్ల శ‌రీరం అంతా రిలాక్స్ అవుతుంది. మ‌న‌స్సుకు ప్ర‌శాంత‌త క‌లుగుతుంది. హాయిగా అనిపిస్తుంది. దీంతో నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. నిద్ర‌లేమి స‌మ‌స్య ఉన్న‌వారు రాత్రి నిద్ర‌కు ముందు స్నానం చేయాలి. వేడినీటితో స్నానం చేస్తే ఇంకా మంచిది. చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది. బెడ్‌పై ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు.

2. రోజూ ఒత్తిళ్లు, ఆందోళ‌న‌ల‌తో స‌త‌మ‌తం అయ్యేవారు వాటి నుంచి బ‌య‌ట ప‌డాలంటే రోజూ రాత్రి నిద్ర‌కు ముందు స్నానం చేయాలి. దీంతో మ‌న‌స్సు ఒక్క‌సారిగా ప్ర‌శాంతంగా మారుతుంది. రోజంతా అనుభ‌వించిన ఒత్తిడి, ఆందోళ‌న వెంట‌నే త‌గ్గుతాయి. మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. మ‌రుస‌టి రోజు చురుగ్గా ఉంటారు. ఉత్సాహంగా ప‌నిచేస్తారు. మెద‌డు కూడా యాక్టివ్‌గా ఉంటుంది.

3. రాత్రి పూట స్నానం చేయ‌డం వ‌ల్ల మ‌న‌స్సుకు ప్ర‌శాంత‌త క‌లిగి శ‌రీర అవ‌య‌వాల‌కు ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. దీంతో స్త్రీ, పురుషులు శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు.

4. రాత్రి పూట స్నానం చేసిన త‌రువాత చ‌ర్మం బాగా క్లీన్ అవుతుంది. దీంతో చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మ‌రుస‌టి రోజు ఉద‌యం చర్మానికి ఎలాంటి దుమ్ము, ధూళి సోక‌వు. క‌నుక చ‌ర్మ క‌ణాలు మ‌ర‌మ్మ‌త్తుల‌కు గుర‌వుతాయి. దీంతో చ‌ర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. ముఖంపై ఉండే మొటిమ‌లు, మ‌చ్చ‌లు పోతాయి.

5. ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పుల స‌మ‌స్య‌లు ఉన్న‌వారు రాత్రి పూట స్నానం చేస్తే ఆయా నొప్పుల నుంచి ఉప‌శ‌మనం ల‌భిస్తుంది. దీంతో నొప్పులు రావు. రాత్రి పూట ఇబ్బందులు ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

Editor

Recent Posts