Thavudu : బియ్యం, గోధుమలను పాలిష్ పట్టగా వచ్చే పొడిని తవుడు( రైస్ బ్రాన్) అని అంటారని మనకు తెలిసిందే. సాధారణంగా ఈ తవుడును పశువులకు ఆహారంగా ఇస్తారు. కానీ ఈ తవుడును రోజుకు రెండు లేదా మూడు టీ స్పూన్ల మోతాదులో తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా తెలియజేసారు. ఈ తవుడును ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో 40 శాతం యాంటీ ఆక్సిడెంట్లు వృద్ది చెందుతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు పెరగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫ్రీరాడికల్స్ ను, దీర్ఘకాల రోగాలకు కారణమయ్యే కణాలను నిర్మూలించడానికి తవుడు చక్కగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే తవుడును తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ ప్లామేషన్ కూడా తగ్గుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. తవుడులో ఉండే గామా ఒరైజనాల్ అనే రసాయన సమ్మేళనం ఇన్ ప్లామేషన్ కు కారణమయ్యే ఎంజైమ్ లను నశింపజేస్తుంది. దీంతో శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తవుడును తీసుకోవడం వల్ల అన్ని రకాల బి కాంప్లెక్స్ విటమిన్స్ శరీరానికి అందుతాయి. అలాగే 100 గ్రాముల తవుడులో 45 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. కనుక దీనిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. ధాన్యాల్లో పై పొరల్లో ఎక్కువగా సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు, బి కాంప్లెక్స్ విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు ధాన్యాల పై పొరల్లో ఎక్కువగా ఉంటాయి.
ధాన్యాలను పాలిష్ పట్టడం వల్ల ఈ పోషకాలన్నీ తవుడులోకి వస్తున్నాయి. దీంతో మనం బియ్యం తీసుకోవడం కంటే తవుడును తీసుకోవడం వల్ల మాత్రమే అధిక ప్రయోజనాలను పొందగలుగుతాము. తవుడును పోషకాల గని అని కూడా నిపుణులు అభివర్ణిస్తూ ఉంటారు. తవుడును ఎక్కువ మొత్తంలో తీసుకుని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఈ తవుడును చపాతీ పిండిలో లేదా నీటిలో కలిపి తీసుకోవచ్చు. అలాగే దీనిని వేయించి మినుములతో కలిపి లడ్డూలుగా కూడా చేసుకుని తినవచ్చు. అలాగే దీనిని నేరుగా కూడా తినవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు ఇలా ప్రతి ఒక్కరు ఎవరైనా దీనిని తీసుకోవచ్చు. ఈవిధంగా తవుడును ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరం బలంగా ఉండడంతో పాటు వివిధ రకాల అనారోగ్య సమస్యలు కూడా మన దరి చేరకుండా ఉంటాయని నిపుణుల తెలియజేస్తున్నారు.