హెల్త్ టిప్స్

Amla And Onion : ఉసిరికాయ‌, ఉల్లిపాయ క‌లిపి తీసుకుంటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Amla And Onion : ఆరోగ్యానికి, ఉసిరి ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో కూడా, ఉసిరిని వాడుతూ ఉంటారు. ఉసిరి వలన, అనేక లాభాలను పొందడానికి అవుతుంది. అలానే, ఉల్లితో కూడా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఉల్లిపాయల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఉసిరిలో కూడా, బాగా ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఉసిరి, ఉల్లి రెండూ కూడా అనేక రకాల సమస్యల్ని దూరం చేయగలవు. చాలా రకాల ప్రయోజనాలను, ఈ రెండిటి వల్ల మనం పొందవచ్చు. అయితే, ఈ రెండిటిని కలిపి తీసుకుంటారని కూడా మీకు తెలుసా..?

ఈ రెండిటినీ కలిపి తీసుకుంటే, చాలా రకాల సమస్యలకి దూరంగా ఉండవచ్చు. ఈ రెండిటిని కలిపి తీసుకుంటే, రక్తహీనత సమస్య నుండి ఈజీగా బయట పడొచ్చు. ఈ రోజుల్లో చాలామంది, రక్తహీనతతో బాధపడుతున్నారు. ఐరన్ లోపం వలన మాత్రమే రక్తహీనత సమస్య రాదు. రాగి, విటమిన్స్ లోపం వలన కూడా రక్తహీనత వస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవాళ్లకి, అనేక రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి.

amla and onion many wonderful health benefits

నీరసంగా ఉండడం, ఆయాసం, అలసట, కళ్ళు తిరగడం, గుండె దడ తో పాటుగా, శ్వాస సరిగా ఆడకపోవడం, తల నొప్పి ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకని రక్తహీనత సమస్యను తేలికగా తీసుకోకూడదు. రక్తహీనత సమస్య ఉన్నట్లయితే, కచ్చితంగా సమస్య నుండి బయట పడడానికి చూడాలి.

కొన్ని ఆహార పదార్థాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఉసిరి, ఉల్లి బాగా పనిచేస్తాయి. ఈ రెండిటిని కలిపి తీసుకుంటే, రక్తహీనత సమస్య తగ్గుతుంది. అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, అరకప్పు ఉసిరిముక్కలు తీసుకోండి. ఈ రెండిటిని పేస్టుగా చేసి, రసం తీసుకోండి. ఇందులో కొంచెం తేనె వేసి, ప్రతిరోజు తీసుకోండి. రక్తహీనత సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

Admin

Recent Posts