Coconut Oil Under Eyes : చాలామంది ఆముదాన్ని వివిధ రకాలుగా వాడుతూ ఉంటారు. ఆముదం వలన ఎన్నో లాభాలని, పొందవచ్చు. కొబ్బరినూనె, నువ్వుల నూనె, ఆముదం ఇలా వీటి వలన చాలా ఉపయోగాలు ఉంటాయి. కళ్ళ కోసం, చాలామంది నువ్వులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. చాలా చక్కగా నువ్వుల నూనె పనిచేస్తుంది. అందంగా మెరిసిపోవడానికి కూడా నువ్వుల నూనె బాగా ఉపయోగపడుతుంది.
కళ్ళ మీద నువ్వుల నూనెతో రోజు రాత్రి పడుకునే ముందు, మర్దన చేయడం వలన మంచి నిద్ర ని పొందడమే కాకుండా, కళ్ళ కింద ముడతలు కూడా పోతాయి. కళ్ళ కింద ముడతలు పోవాలంటే, రోజు రాత్రి పూట కొంచెం నువ్వుల నూనె తీసుకుని, కళ్ళ వద్ద ముడతలు ఉన్న ప్రాంతంలో రాసుకున్నట్లయితే, చర్మం మృదువుగా మారుతుంది. అందంగా తయారవుతుంది.
ఆముదం, కొబ్బరి నూనె కూడా ముడతలను తగ్గించగలవు. కొబ్బరి నూనెని నిద్రపోవడానికి ముందు, కళ్ల కింద రాసుకోవడం మంచిది. ఆ తర్వాత మీరు ఉదయాన్నే లేచి గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కుంటే సరిపోతుంది. దీనివలన కళ్ళ కింద ముడతలు బాగా తగ్గిపోతాయి. చర్మంపై కొబ్బరి నూనెని మర్ధన చేయడం వలన చర్మం మృదువుగా మారుతుంది. అంతేకాకుండా చర్మంపై ఉండే ఎటువంటి మచ్చలైనా సరే, ఈజీగా తొలగిపోతాయి.
కాబట్టి, మీరు ఈసారి ఈ చిట్కాని ట్రై చేయొచ్చు. దాంతో, ముడతలు పోవడమే కాకుండా చర్మం కూడా బాగా తయారవుతుంది. కేవలం ఈ రెండే కాకుండా ఆముదం కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఆముదాన్ని మీరు ముడతలు, మచ్చలు ఉన్నచోట రాయడం వలన చక్కటి ప్రయోజనం ఉంటుంది. కళ్ళకింద ఉండే ముడతలు, మచ్చలు పోవాలంటే, రాత్రి నిద్ర పోవడానికి ముందు ఆముదాన్ని కొంచెం వేసి మర్దన చేయండి. ఇలా చేస్తే, కళ్ళ కింద ముడతలు ఈజీగా తగ్గిపోతాయి. మచ్చలు వంటివి కూడా పోతాయి. మీ అందాన్ని మీరు రెట్టింపు చేసుకోవచ్చు.