స్థూలకాయం, థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్, టైముకు భోజనం చేయకపోవడం, మాంసాహారం ఎక్కువగా తినడం.. వంటి అనేక కారణాల వల్ల మనలో చాలా మందికి మలబద్దకం వస్తుంటుంది. అయితే కింద తెలిపిన పలు సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే.. మలబద్దకం నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే…
* ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని పాలను తాగాలి. లేదా పాలలో ఆముదం కలుపుకుని కూడా తాగవచ్చు. దీంతో మరుసటి రోజు విరేచనం సాఫీగా అవుతుంది. ఇలా తరచూ చేస్తే మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు.
* ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగాలి. నిత్యం 3 పూటలా ఇలా చేస్తే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది.
* నిత్యం గుప్పెడు మోతాదులో కిస్మిస్ పండ్లను తినాలి. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది.
* రాత్రి పూట భోజనంలో అన్నం తినకుండా కేవలం గోధుమ పిండితో చేసిన చపాతీలను తింటే.. మలబద్దకం తగ్గుతుంది. గోధుమ పిండిలో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
* రాత్రి భోజనం తరువాత పైనాపిల్ పండ్లను తినాలి. రోజూ ఇలా చేస్తే మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు.
* రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు త్రిఫల చూర్ణం కొద్దిగా తీసుకుని దాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. దీంతో మలబద్దకం తగ్గడమే కాదు, ఇతర జీర్ణ సమస్యలు పోతాయి.
* అరటి పండ్లలో మన శరీరానికి కావల్సిన ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. అరటి పండ్లను నిత్యం తినడం వల్ల మలబద్దకం తగ్గుతుంది.
* రాత్రి పూట భోజనంలో 1 టీస్పూన్ కరివేపాకు పొడిని తినాలి. దీంతో మలబద్దకం నుంచి బయట పడవచ్చు.
* రాత్రి నిద్రపోయే ముందు ఆముదాన్ని కొద్దిగా వేడి చేసి తీసుకోవాలి. దీంతో మలబద్దకం తగ్గుతుంది.
* ఒక రాగి చెంబు తీసుకుని అందులో నీళ్లు పోసి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. ఇలా రోజూ చేస్తే మలబద్దకం సమస్య బాధించదు.