Banana In Winter : చ‌లికాలంలో అర‌టిపండ్ల‌ను తిన‌వ‌చ్చా..? తింటే ఏం జ‌రుగుతుంది..?

Banana In Winter : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో అర‌టిపండ్లు కూడా ఒక‌టి. అర‌టి పండ్లు తియ్య‌గా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే అన్ని కాలాల్లోను మ‌న‌కు అర‌టిపండ్లు ల‌భిస్తూ ఉంటాయి. అర‌టిపండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అర‌టిపండ్ల‌ల్లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఫైబ‌ర్ వంటి ఎన్నో ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటాయి. శ‌రీరానికి శ‌క్తిని అందించ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో, బీపీని త‌గ్గించ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, ఎముక‌ల‌ను ధృడంగా చేయ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా అర‌టిపండ్లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. అయితే చ‌లికాలంలో మ‌న‌కు ఎక్కువ‌గా వేడి వేడిగా, రుచిగా, ఘాటుగా ఉండే ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవాల‌నే కోరిక క‌లుగుతుంది.

అలాంట‌ప్పుడు మ‌నకు అర‌టిపండును తీసుకోవాల‌న్నా కోరికే క‌ల‌గ‌దు. అలాగే చాలా మంది చ‌లికాలంలో అర‌టిపండును తీసుకోవడానికి కూడా భ‌య‌ప‌డుతూ ఉంటారు. చ‌లికాలంలో అర‌టిపండును తీసుకోవ‌డం వ‌ల్ల ద‌గ్గు, క‌ఫం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని భ‌య‌ప‌డ‌తారు. అస‌లు చ‌లికాలంలో అర‌టిపండును తీసుకోవ‌చ్చా… చ‌లికాలంలో అర‌టిపండును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. చ‌లికాలంలో అర‌టిపండును తీసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. చ‌లికాలంలో అరటిపండును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని వారు చెబుతున్నారు. చ‌లికాలంలో మ‌న శ‌రీరంలో జీర్ణ‌క్రియ నెమ్మ‌దిగా ఉంటుంది. అలాంట‌ప్పుడు అర‌టిపండును తీసుకోవ‌డం వ‌ల్ల దానిలో ఉండే ఫైబ‌ర్ జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.

Banana In Winter can you take them or what
Banana In Winter

అలాగే చ‌లికాలంలో ఎముకలు విరిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక చ‌లికాలంలో అర‌టిపండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌ల సాంద్ర‌త పెర‌గ‌డంతో పాటు ఎముకలు ధృడంగా త‌యార‌వుతాయి. అదే విధంగా చ‌లికాలంలో చాలా మందికి ఎప్పుడూ నీర‌సంగా ఉన్న‌ట్టు అనిపిస్తుంది. క‌నుక అర‌టిపండును తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గినంత శ‌క్తి ల‌భిస్తుంది. నీర‌సం, బ‌ల‌హీన‌త ద‌రి చేర‌కుండా ఉంటాయి. చ‌లికాలంలో వీటిని మ‌ధ్యాహ్న స‌మ‌యంలో తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే సాయంత్రం పూట రోజూ రెండు అర‌టి పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గినంత విశ్రాంతి ల‌భిస్తుంది. దీంతో రాత్రి స‌మయంలో చ‌క్క‌గా నిద్ర‌ప‌డుతుంది. చ‌లికాలంలో అర‌టిపండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఈ విధంగా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

అయితే అర‌టిపండ్లు చ‌ల్ల‌టి ఆహారాలు. వీటితో మిల్క్ షేక్స్ వంటి మ‌రింత చ‌ల్లటి ఆహారాల‌ను త‌యారు చేసి తీసుకోకూడ‌దు. దీంతో ఇన్పెక్ష‌న్ లు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. చ‌లికాలంలో అర‌టిపండ్ల‌ను తీసుకున్న‌ప్ప‌టికి మితంగా తీసుకోవాలి. వీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు, ఉబ్బ‌సం, క‌ఫం,శ్లేష్మం వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే రాత్రిపూట అర‌టిపండ్ల‌ను తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది. ముఖ్యంగా శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు ఉన్న వారు అస్సలు తీసుకోక‌కూడ‌దని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts