Bottle Gourd For Weight Loss : నేటి తరుణంలో మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. మారిన మన జీవన విధానం,ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, తగినంత శ్రమ చేయకపోవడం, కూర్చుని ఎక్కువ గంటలు పని చేయడం వంటి వివిధ కారణాల చేత అధిక బరువు సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. అలాగే అధిక బరువు వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన కూడా పడాల్సి వస్తుంది. కనుక ఈ సమస్య నుండి వీలైనంత త్వరగా బయటపడాలి. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వ్యాయామం చేయడం, డైటింగ్ పద్దతులను పాటించడం, వాకింగ్, జాజింగ్ ఇలా అనేక రకాల పద్దతులను పాటిస్తూ ఉంటారు.
వీటితో పాటు మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్ ను తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు మనం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వారుతెలియజేస్తున్నారు. బరువు తగ్గించే ఈ జ్యూస్ ను తయారు చేయడం చాలా సులభం. అలాగే దీనిని తాగడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. అధిక బరువును తగ్గించే ఈ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం సొరకాయను ఉపయోగించాల్సి ఉంటుంది. సగం సొరకాయ ముక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేడి నీటిలో వేసుకోవాలి.
ఇదే నీటిలో ఒక ఇంచు అల్లం ముక్క,2 వెల్లుల్లి రెబ్బలు వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత ఈ ముక్కలను వడకట్టి చల్లారిన తరువాత జార్ లో వేసి జ్యూస్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ జ్యూస్ లో కొద్దిగా సైంధవ లవణంతో పాటు కొద్దిగా త్రికట చూర్ణం వేసి బాగా కలపాలి. త్రికట చూర్ణం మనకు ఆయుర్వేద షాపుల్లో లభిస్తుంది. ఈ చూర్ణాన్ని శొంఠి, పిప్పిళ్లు, మిరియాలు కలిపి తయారు చేస్తారు. ఇలా తయారు చేసుకున్న సొరకాయ జ్యూస్ ను రోజూ ఉదయం పరగడుపున తాగాలి. పరగడుపున వీలు కాని వారు అల్పాహారం చేసిన రెండు గంటల తరువాత తాగాలి. ఈ విధంగా సొరకాయతో జ్యూస్ ను తయారు చేసి తీసుకోవడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు సులభంగా కరిగిపోతుంది.
దీంతో మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. అంతేకాకుండా ఈ జ్యూస్ ను తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాలేయంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. శరీరంలో మలినాలు, విష పదార్థాలు సులభంగా తొలగిపోతాయి. మూత్రపిండాలతో పాటు పొట్ట ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అధిక బరువుతో బాధపడే వారు ఈ విధంగా సొరకాయతో జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.