Brain Boosting Foods : కొందరికి ఏదైనా వెంటనే గుర్తుకు వస్తుంది. కొందరికి ఎంత మననం చేసుకున్నప్పటికి గుర్తుకు రాదు. అలాగే కొందరికి జ్ఞాపక శక్తి ఎక్కువగా, కొందరికి తక్కువగా ఉంటుంది. అలాగే మతి మరుపు సమస్యతో బాధపడే వారు కూడా ఉంటారు. ఇలా జ్ఞాపక శక్తి తగ్గి మతిమరుపు సమస్య రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో ఇలా మతి మరుపు సమస్యతో బాధపడే వారు ఎక్కువవుతున్నారు. పెద్దలే కాకుండా పిల్లలు కూడా చదివింది గుర్తుకు లేక అనేక ఇబ్బందులు పడుతుంటారు. మనం తీసుకునే ఆహర పదార్థాల ద్వారా మనం జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చు. అలాగే ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
అంతేకాకుండా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ ఆహారాలను పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల పిల్లల్లో ఒత్తిడి తగ్గి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. జ్ఞాపక శక్తిని మెరుగపరిచే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెదడు పనితీరును మెరుగుపరిచే ఆహారాల్లో ఆపిల్ ఒకటి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడును చురుకుగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి మనం తీసుకోవాల్సిన బాదంపప్పు ఒకటి. రోజుకు ఒక గుప్పెడు బాదం పప్పులను తినడం వల్ల ఆందంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
వీటిని తీసుకోవడం వల్ల మెదడు పని తీరు మెరుగుపడుతుంది. ఈ బాదంపప్పును నేరుగా కాకుండా నానబెట్టి పొట్టు తీసి తినడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని పొట్టు తీసి పేస్ట్ గా చేసి పాలల్లో కలిపి ఇవ్వడం వల్ల వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే మెదడు పనితీరును మెరుగుపరిచే ఆహారాల్లో వాల్ నట్స్ ఒకటి. రోజూ గుప్పెడు వాల్ నట్స్ నుతీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో, మెదడు పనితీరును మెరుగుపరచడంలో, జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో వాల్ నట్స్ మనకు ఎంతో సహాయపడతాయి.
వాల్ నట్స్ ను మనం రోజూ తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. మన మెదడు ఆరోగ్య మనేది మన వంటింట్లో ఉండే పోపుల పెట్టెలో కూడా దాగి ఉంది. మన పోపుల పెట్టెలో ఉండే మిరియాలు మన మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడతాయి. మెదడును చురుకుగా ఉంచి జ్ఞాపకశక్తిని వృద్ధి చేయడంలో మిరియాలు మనకు సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. మెదడును చురుకుగా ఉంచే ఆహారాల్లో సోంపు గింజలు కూడా ఒకటి. సోంపు గింజల్లో మెదడుకు అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. సోంపు గింజలను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యంతో పాటు మెదడు పనితీరును కూడా మెరుగుపరుచుకోవచ్చు.
వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడును చురుకుగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే మనం బాదం పప్పును, సోంపు గింజలను, కండ చక్కెరను కలిపి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని పాలల్లో కలిపి పిల్లలకు ఇవ్వడం వల్ల పిల్లల్లో తెలివి తేటలు పెరుగుతాయి. అలాగే ఎండు ద్రాక్షను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కూడా మన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వీటిలో ఉండే పోషకాలు మెదడును చురుకుగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మనం మన మెదడును ఆరోగ్యంగా, చురుకుగా ఉంచుకోవచ్చు. దీంతో మన జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.