Cancer Causing Foods : మనలో చాలా మందిని బలి తీసుకుంటున్న అనారోగ్య సమస్యల్లో క్యాన్సర్ కూడా ఒకటి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరిని ఇబ్బందులకు గురి చేస్తుంది ఈ ప్రాణాంతకమైన క్యాన్సర్. నేటి తరుణంలో మనలో చాలా మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. ఎటువంటి చెబు అలవాట్లు లేకపోయినప్పటికి కూడా క్యాన్సర్ బారిన పడుతూ ఉంటారు. అయితే మారిన మన ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి నిపుణులు చెబుతున్నారు. మారిన మన ఆహారపు అలవాట్లు క్యాన్సర్ బారిన పడడానికి ఎలా కారణమవుతున్నాయో ముందుగా మనం తెలుసుకుంటే మనం వాటి జోలికి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
కనుక క్యాన్సర్ రావడానికి గల కారణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం అలాగే అవసరానికి మించిన ఆహారాన్ని తీసుకోవడంవ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో షుగర్ లెవల్స్ ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో ఇన్ ప్లామేషన్ పెరుగుతుంది. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ కారణంగా కణాలు దెబ్బతింటూ ఉంటాయి. దీంతో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోవడం, డీప్ ఫ్రై చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
నూనెలో వేయించిన పదార్థాలలో ఎలక్ట్రాన్స్ ఉండవు. ఈ ఆహారాలను మనం తీసుకున్నప్పుడు మన శరీరంలో ఉండే ఎలక్ట్రాన్స్ ను ఇవి దొంగలించి కణజాలం దెబ్బతినేలా చేస్తాయి. కణజాలం దెబ్బతినడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే నూనెలో వేయించినప్పుడు ఆహారపదార్థాల అంచులు మాడిపోతూ ఉంటాయి. ఇలా మాడిన ఆహారాన్ని కూడా మనం తింటూఉంటాము. మాడిన ఆహారంలో ఫ్రీరాడికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఫ్రీరాడికల్స్ క్యాన్సర్ ప్రేరకాలు అని నిపుణులు చెబుతున్నారు. కనుక మాడిన ఆహారాలను తీసుకోకూడదు. అదేవిధంగా నిల్వ పచ్చళ్లను తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
నిల్వ పచ్చళ్లల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలన్నీ కూడా క్యాన్సర్ కారకాలు. ఇవి డిఎన్ఎ లో మార్పులు తీసుకునావడంతో పాటు కణాల పనితీరును దెబ్బతిస్తాయి. ఆహారంలో ఉప్పును ఎక్కువగా తీసుకునే వారికి క్యాన్సర్ త్వరగా వస్తుందని కూడా వారు చెబుతున్నారు. ఇక ఆల్కాహాల్ ను తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆల్కాహాల్ డిఎన్ఎ లో మార్పు తీసుకు వచ్చి క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అలాగే మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చేఅవకాశాలు ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
నేటి తరుణంలో యువత ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ లను, జంక్ ఫుడ్ ను, ఆల్కాహాల్ ను, రెడీ టు ఈట్ వంటి ఫుడ్ ఐటమ్స్ ను తీసుకోవడం, బేకరీ ఐటమ్స్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటి తయారీలో కలర్స్, ఫ్రిజర్వేటివ్స్, ప్లేవర్స్, టేస్టీ సాల్ట్ ఇలా రకరకాల పదార్థాలను వాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా క్యాన్సర్ ప్రేరేపకాలు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఫ్రీరాడికల్స్ పెరిగిపోతాయి. దీంతో యువత ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతున్నారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే మనం ఈ ఆహారాలను తీసుకోవడం తగ్గించాలని మంచి ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.