క్యాన్సర్‌తో పోరాడేందుకు సహాయపడే ఆహారాలు..!

క్యాన్సర్‌ అనేది ప్రాణాంతక వ్యాధి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా క్యాన్సర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అందువల్ల ఎవరైనా సరే క్యాన్సర్‌ రాకుండా చూసుకోవడం ఆవశ్యకం అయింది. క్యాన్సర్‌ను ప్రారంభంలో గుర్తిస్తే చికిత్స చేయడం సులభతరం అవుతుంది. అయితే క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించేందుకు మనకు పలు ఆహారాలు ఉపయోగపడతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. బ్రోకలీ

cancer fighting foods in telugu

వీటిల్లో ఐసోథియోసైనేట్‌, ఇండోల్‌ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ కారకాలను నిర్మూలిస్తాయి. క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. ఈ విషయం సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది.

2. ఆకు కూరలు

ఆకుకూరలు అనేక వ్యాధులతో పోరాడేందుకు ఉపయోగపడతాయి. ఇవి క్యాన్సర్‌ను నివారించేందుకు సహాయ పడతాయి. పాలకూర, తోటకూర వంటివి క్యాన్సర్‌పై పోరాడుతాయి. వీటిల్లో ఫైబర్‌, బీటా కెరోటీన్‌, లుటీన్‌, ఫోలేట్‌, కెరోటినాయిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ రాకుండా చూస్తాయి.

3. క్యారెట్‌

సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల ప్రకారం.. క్యారెట్లను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని వెల్లడైంది. కనుక క్యాన్సర్‌ రాకుండా ఉండాలంటే తరచూ క్యారెట్లను తినాల్సి ఉంటుంది.

4. ఎర్ర ద్రాక్ష

ఈ రంగు ద్రాక్షల్లో రెస్వెరాట్రాల్‌ అనబడే యాంటీ ఆక్సిడెంట్‌ ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కూడా కలిగి ఉంటుంది. అందువల్ల క్యాన్సర్‌ నివారణకు ఈ ద్రాక్ష సహాయపడుతుంది.

5. గ్రీన్‌ టీ

గ్రీన్‌ టీలో క్యాన్సర్‌ నిరోధక గుణాలు ఉంటాయి. బ్లాక్‌ టీ కన్నా గ్రీన్‌ టీలోనే ఎక్కువగా కాటెచిన్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ రాకుండా చూస్తాయి.

6. టమాటా

వీటిల్లో లైకోపీన్‌ అనబడే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. క్యాన్సర్‌ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల టమాటాలను తరచూ ఆహారంలో తీసుకుంటే క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ప్రోస్టేట్‌ క్యాన్సర్ రాకుండా ఉంటుంది.

Share
Admin

Recent Posts