అరటి పండ్లలో అనేక అద్భుమైన పోషకాలు ఉంటాయి. వీటిలో ఫైబర్, పొటాషియం, విటమిన్ బి6, సి లు ఉంటాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా చూడడమే కాదు, జీర్ణవ్యవస్థను రక్షిస్తాయి. ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అయితే అరటి పండ్లను కొందరు పచ్చిగా ఉంటేనే ఇష్టపడతారు. కొందరు కొద్దిగా పండిన పండ్లను తింటారు. ఇంకా కొందరు బాగా పండిన అరటి పండ్లకే ప్రాధాన్యతను ఇస్తారు. అయితే ఎంతలా పండిన అరటి పండును తింటే.. ఎలాంటి లాభాలు కలుగుతాయో.. ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిస్ ఉన్నవారు ఆకుపచ్చ అరటి పండ్లను తినవచ్చు. వీటిల్లో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. అయితే ఆకుపచ్చని అరటి పండ్లను పొట్టు తీయడం కష్టం. కానీ పొట్టు తీసి వాటిని సలాడ్లు, కూరల రూపంలో తినవచ్చు. దీంతో పోషకాలు అందుతాయి. డయాబెటిస్ ఉన్నవారు వీటిని తింటే షుగర్ స్థాయిలు పెరగవు.
సాధారణంగా చాలా మంది ఈ రంగులో ఉన్న అరటి పండ్లనే ఎక్కువగా తింటారు. బయట మనకు ఇవే ఎక్కువగా లభిస్తాయి. అయితే ఈ రంగులో పండిన అరటి పండ్లను తినడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉంటాయి. ఇన్‌ఫెక్షన్లు, దురదలు రాకుండా ఉంటాయి.
పైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడే వరకు పండిన అరటి పండ్లలో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. వీటిని పోషకాలకు గనిగా చెప్పవచ్చు. వీటిల్లో ట్యూమర్ కరప్షన్ ఫ్యాక్టర్ (టీఎన్ఎఫ్) ఉంటుంది. ఇది శరీరంలోని హానికర కణాలను, వ్యర్థాలను బయటకు పంపుతుంది. దీంతో శరీరం శుభ్రంగా మారుతుంది. అలాగే అనేక పోషఖాలు లభిస్తాయి. అల్సర్లు ఉన్నవారు వీటిని తింటే చాలా మంచిది. అల్సర్లు నయమవుతాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఇలా పండిన పండ్లను తినరాదు. ఇవి సహజంగానే తియ్యగా ఉంటాయి. చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది.
వీటిల్లో చక్కెర స్థాయిలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. కనుక వీటిని డయాబెటిస్ ఉన్నవారు అస్సలు తినరాదు. వీటిల్లోనూ పైన తెలిపిన టీఎన్ఎఫ్ ఎక్కువగానే ఉంటుంది. అలాగే.. ఇలా పండిన పండ్లను తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. మలబద్దకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి.
అయితే అరటి పండ్లు ఎలా పండినప్పటికీ వాటిల్లో కొన్ని పోషకాలు మాత్రం కామన్‌గా ఉంటాయి.
* అరటి పండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనబడే సమ్మేళనం శరీరంలో సెరటోనిన్ ఉత్పత్తికి కారణమవుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గుతాయి. అందువల్ల డిప్రెషన్, ఒత్తిడిలతో బాధపడేవారికి అరటి పండ్లు చక్కని సహజ సిద్ధమైన ఔషధాలు అని చెప్పవచ్చు.
* అరటి పండ్లలో కొవ్వును కరిగించే కోలిన్ ఉంటుంది. అందువల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.
* ఈ పండ్లలో మెగ్నిషియం, పొటాషియం, మాంగనీస్ ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి. కండరాల నిర్మాణానికి దోహదపడుతాయి. అందుకనే జిమ్‌లకు వెళ్లేవారు, వ్యాయామం చేసే వారు, క్రీడాకారులు ఎక్కువగా అరటి పండ్లను తింటుంటారు.
* అరటి పండ్లను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
* అరటి పండ్లలో ఉండే ఐరన్ అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తుంది.
* అరటి పండ్లను తింటే ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తుంది. తీవ్రంగా అలసట ఉన్నవారు, నీరసం ఉన్నవారు అరటి పండ్లను తింటే వెంటనే శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. వెంటనే మళ్లీ పని ప్రారంభించవచ్చు.
అరటి పండ్లను ఉదయం అల్పాహారంలో లేదా మధ్యాహ్నం భోజనం తరువాత లేదా సాయంత్రం స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365