Cardamom Water : యాల‌కుల‌ను నీటిలో వేసి మ‌రిగించి తాగండి.. మిమ్మ‌ల్ని మీరే గుర్తు ప‌ట్ట‌లేరు..!

Cardamom Water : మ‌నం వంటల్లో వాడే మ‌సాలా దినుసుల్లో యాల‌కులు ఒక‌టి. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. యాల‌కులు చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. వీటిని వంటల్లో వేయ‌డం వ‌ల్ల వంటల రుచి వాస‌న పెరుగుతుంది. యాల‌కుల్లో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయ‌ని ఆయుర్వేదంలో అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తగ్గించ‌డంలో దీనిని ఔష‌ధంగా ఉప‌యోగిస్తార‌ని నిపుణులు చెబుతున్నారు. కీమో థెర‌పీ వ‌ల్ల వ‌చ్చే దుష్ప్ర‌భావాల‌ను త‌గ్గించే గుణం ఈ యాల‌కుల‌కు ఉంద‌ని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా తెలియ‌జేసారు. యాల‌కుల‌ను ఉప‌యోగించ‌డం వల్ల గ్యాస్, అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం, అల్స‌ర్ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. అలాగే సైన‌స్, జ‌లుబు, అస్థ‌మా వంటి శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో కూడా ఇవి మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డతాయి.

యాల‌కుల్లో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫ‌ర‌స్, ఐర‌న్, యాంటీ ఆక్సిడెంట్ల‌తో పాటు యాంటీ సెప్టిక్ గుణాలు కూడా ఎక్కువ‌గా ఉన్నాయి. యాల‌కుల‌ను నీటిలో వేసి మ‌రిగించి తీసుకుంటే మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. యాల‌కుల నీటిని ఉద‌యం పూట ప‌ర‌గ‌డుపున గోరు వెచ్చ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో మ‌లినాల‌న్నీ తొల‌గిపోతాయి. మూత్ర‌పిండాల్లో పేరుకుపోయిన మ‌లినాలు తొల‌గిపోతాయి. మూత్రాశ‌య ఇన్ఫెక్ష‌న్ లు రాకుండా ఉంటాయి. రోజూ యాల‌కుల నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే ఫ్రీ రాడిక‌ల్స్ తొల‌గిపోతాయి. ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. అలాగే యాల‌కుల‌ను నోట్లో వేసుకుని చ‌ప్ప‌రిస్తూ ఉండ‌డం వ‌ల్ల ధూమ‌పానం, మ‌ద్య‌పానం చేయాల‌న్నా ఆలోచ‌నా రాకుండా ఉంటుంది. అలాగే నోటి దుర్వాస‌న రాకుండా ఉంటుంది. గోరు వెచ్చని యాల‌కుల నీటిని తాగ‌డం వ‌ల్ల డిప్రెష‌న్ దూరం అవుతుంది. వికారం, వాంతులు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అలాగే ప‌డుకునే ముందు పాల‌ల్లో యాల‌కుల పొడిని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది.

Cardamom Water take daily in this way for many benefits
Cardamom Water

అలాగే యాల‌కుల నీటిని తాగ‌డం వ‌ల్ల ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ మెరుగుప‌డుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌లెత్త‌కుండా ఉంటుంది. యాల‌కుల నూనెను చ‌ర్మానికి రాసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అదే విధంగా గోరు వెచ్చ‌ని యాల‌కుల నీటిని తాగ‌డం వ‌ల్ల గొంతు నొప్పి త‌గ్గుతుంది. అలాగే ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా పెరుగుతుంది. యాల‌కుల‌ను తిన్నా లేదా యాల‌కుల నీటిని తాగినా ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. అంతేకాకుండా బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు యాల‌కుల నీటిని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ విధంగా యాల‌కులు మ‌న‌కు ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల లేదా యాల‌కుల నీటిని తాగ‌డం వల్ల మ‌నం అనేక ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

D

Recent Posts