Castor Oil : మనకు చుట్టూ అనేక రకాల ఔషధ మొక్కలల్లో ఆముదం మొక్క కూడా ఒకటి. ఆముదం మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దీనిని సంస్కృతంలో ఏరండ, పంచాంగుల అని పిలుస్తారు. ఆముదం మొక్కల్లో ప్రతి భాగం కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ మొక్కను అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఔషధంగా ఉపయోగిస్తారు. ఆముదంలో ఎర్ర ఆముదం, తెల్ల ఆముదం, పెద్ద ఆముదం, చిట్టి ఆముదం అనే రకాలు ఉంటాయి. ఆముదం నూనెను వంటనూనెగా కూడా పూర్వం ఉపయోగించే వారు. ఆముదం చెట్టును ఉపయోగించి మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. కడుపులో నులిపురుగులను తొలగించడంలో ఆముదం ఆకులు మనకు ఎంతగానో సహాయపడతాయి.
ఆముదం ఆకులను తీసుకుని కడుపు రుద్దాలి. ఇలా రుద్దడం వల్ల కడుపులో పురుగులు మలద్వారం ద్వారా బయటకు పోతాయి. ఆముదం ఆకులను, కర్పూరాన్ని కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమంతో కట్టు కట్టడం వల్ల మూల వ్యాధి తగ్గుతుంది. అలాగే కొంత మంది స్త్రీలల్లో నెలసరి నెలల కొద్ది రాకుండా ఉంటుంది. అలాంటి వారు ఆముదం ఆకులను కచ్చా పచ్చగా దంచి వేడి చేసి పొత్తి కడుపుపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల నెలసరి వెంటనే వస్తుంది. ఆముదం నూనెను వాడడం వల్ల జుట్టు నల్లగా, పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. ఆముదం నూనెలో యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ నూనెను వాడడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి.
చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆముదం ఆకులను నువ్వుల నూనె రాసి వేడి చేయాలి. తరువాత ఈ ఆకులను నొప్పులు ఉన్న చోట ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇవే కాకుండా మలబద్దకం, పక్షవాతం వంటి అనారోగ్య సమస్యలను తగ్గించడంలో కడా ఆముదం చెట్టు మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ విధంగా ఆముదం చెట్టు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని వాడడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి చాలా సులభంగా బయటపడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.