Malai Kulfi : చ‌ల్ల చ‌ల్ల‌ని మ‌లై కుల్ఫీ.. త‌యారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Malai Kulfi : పాల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన ప‌దార్థాల్లో మ‌లై కుల్పీ కూడా ఒక‌టి. ఈ కుల్ఫీ చాలా రుచిగా ఉంటుంది. మ‌న‌కు ఈ కుల్పీ ఎక్కువ‌గా వేస‌వి కాలంలో ల‌భిస్తుంది. చాలా మంది ఈ కుల్ఫీని ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటారు. అయితే చాలా మంది ఈ కుల్ఫీని ఇంట్లో త‌యారు చేసుకోవ‌డం వీలు కాదు అని భావిస్తూ ఉంటారు. కానీ చాలా సుల‌భంగా ఈ కుల్ఫీని ఇంట్లో త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ మ‌లై కుల్ఫీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌లై కుల్ఫీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిక్క‌టి పాలు -ఒక లీట‌ర్, నీళ్లు – 2 టేబుల్ స్పూన్స్, పాల‌పొడి – అర క‌ప్పు, పాల మీగ‌డ లేదా ఫ్రెష్ క్రీమ్ – పావు క‌ప్పు, పంచ‌దార – 1/3 క‌ప్పు, కండెన్స్డ్ మిల్క్ – 3 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా.

Malai Kulfi recipe in telugu make in this way
Malai Kulfi

మ‌లై కుల్ఫీ త‌యారీ విధానం..

ముందుగా అడుగు మందంగా ఉండే క‌ళాయిలో నీళ్లు, పాలు పోసి వేడి చేయాలి. ఇందులోనే పాల‌పొడి, పాల మీగ‌డ వేసి క‌ల‌పాలి. ఈ పాల‌ను 10 నుండి 15 నిమిషాల పాటు పెద్ద మంట‌పై మ‌రిగించాలి. పాలు మ‌రిగిన త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి పాల‌ను మ‌రిగించాలి. పాలు మ‌రుగుతుండ‌గానే మ‌రో క‌ళాయిలో పంచ‌దార వేసి వేడి చేయాలి. పంచ‌దార క‌రిగి క్యార‌మెల్ లాగా అయిన త‌రువాత దీనిని మ‌రుగుతున్న పాల్ల‌లో వేసి క‌ల‌పాలి. త‌రువాత కండెన్స్డ్ మిల్క్ వేసి క‌ల‌పాలి. త‌రువాత పావు క‌ప్పు పాలల్లో కార్న్ ఫ్లోర్ వేసి క‌ల‌పాలి. ఈ పాల‌ను మరుగుతున్న పాలల్లో వేసి క‌ల‌పాలి. ఇందులోనే యాల‌కుల పొడి వేసి క‌ల‌పాలి.

పాలు కొద్దిగా చిక్క‌బ‌డిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. ఇప్పుడు ఈ పాల‌ను జార్ లో వేసి ఒక నిమిషం పాటు మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి క‌ల‌పాలి. ఇప్పుడు గ్లాస్ లేదా మూత వెడల్పుగా స్టీల్ డ‌బ్బాలో లేదా గాజు సీసాలో ఈ మిశ్ర‌మాన్ని వేసుకోవాలి. త‌రువాత పైన పాస్టిక్ క‌వ‌ర్ లేదా సిల్వ‌ర్ పాయిల్ ను ఉంచి మూత పెట్టాలి. వీటిని 8 నుండి 10 గంట‌ల పాటు ఫ్రీజ‌ర్ లో ఉంచాలి. త‌రువాత బ‌య‌ట‌కు తీసి నెమ్మ‌దిగా గ్లాస్ నుండి వేరు చేసుకుని క‌ట్ చేసుకోవాలి. పైన మ‌రికొద్దిగా డ్రై ఫ్రూట్స్ ను చ‌ల్లుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌లై కుల్ఫీ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts