గ్రీన్ టీ, హెర్బల్ టీ, బ్లాక్ టీ.. ఇలా రక రకాల టీలు అందుబాటులో ఉన్నట్లే మనకు కమోమిల్ టీ (chamomile tea) కూడా మార్కెట్‌లో లభిస్తోంది. గడ్డి చామంతి పూల నుంచి దీన్ని తయారు చేస్తారు. ఈ టీ తాగడం వల్ల మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. పలు అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. ఈ టీ వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. గడ్డి చామంతి పూల టీని తాగడం వల్ల నాడులు ప్రశాంతంగా మారుతాయి. నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. నిద్ర సరిగ్గా వస్తుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారు ఈ టీని తాగితే మంచిది.
2. ఈ టీని నిత్యం సేవించడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మన శరీరంలో ఉండే బాక్టీరియా, వైరస్‌లు నశిస్తాయి. దీంతో వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
3. జలుబు ఉన్నవారికి ఈ టీ అద్భుతంగా పనిచేస్తుంది. తీవ్రమైన జలుబు ఉన్నా ఒక కప్పు వేడి వేడి కమోమిల్ టీని తాగితే మ్యాజిక్‌లా పనిచేస్తుంది. జలుబు ఇట్టే తగ్గుతుంది. అలాగే ఈ టీని ఆవిరిలా పీలిస్తే ముక్కు దిబ్బడ తగ్గుతుంది. దీంతోపాటు ముక్కు నుంచి నీరు కారడం కూడా తగ్గుతుంది. అలాగే గొంతు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
4. ఈ టీని సేవించడం వల్ల కండరాల నొప్పులు, పీరియడ్స్ నొప్పులు తగ్గుతాయి. ఈ విషయాన్ని సైంటిస్టులు శాస్త్రీయంగా ధ్రువీకరించారు కూడా. ఈ టీలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాల వల్లే ఆయా నొప్పులు తగ్గుతాయి.
5. కడుపు నొప్పి, గ్యాస్, అజీర్ణం, విరేచనాలు, వికారం, వాంతులు సమస్యలకు ఈ టీతో చెక్ పెట్టవచ్చు. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ బయో టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ వారు తెలియజేశారు.
6. గాయాలు, పుండ్లు, చర్మ సమస్యలను ఈ టీ తగ్గిస్తుంది.
7. ఒత్తిడి, ఆందోళన, ఇతర మానసిక సమస్యలు ఉన్నవారు కమోమిల్ టీని తాగడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
8. కమోమిల్ టీ తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు తగ్గుతాయి. చర్మంపై వృద్ధాప్య ఛాయలు కనిపించవు. ఎండ వల్ల చర్మం కందిపోకుండా ఉంటుంది. డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి.
9. కమోమిల్ టీ తాగడం వల్ల చుండ్రు సమస్య ఉండదు. వెంట్రుకలు దృఢంగా మారుతాయి.