హెల్త్ టిప్స్

Tooth Decay : రోజూ దీన్ని కాసేపు న‌మ‌లండి చాలు.. పుచ్చు ప‌న్ను పోతుంది.. నొప్పి త‌గ్గుతుంది..!

Tooth Decay : ఎలా అయితే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలో.. అలానే మన పంటి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. పంటి ఆరోగ్యం దెబ్బ తినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. పంటి ఆరోగ్యం కోసం కచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పంటి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తే అనవసరంగా రకరకాల పంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ రోజుల్లో చాలా మందికి రకరకాల పంటి సమస్యలు వస్తుండడంతో డెంటిస్టుల దగ్గరికి వెళ్లి రకరకాల ట్రీట్మెంట్లను చేయించుకుంటున్నారు. దంత క్షయం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి.. అనే విషయాన్ని ఆరోగ్య నిపుణులు ఈరోజు చెప్పారు. మరి ఇక దాని గురించి చూసేద్దాం.

రెండు పూట‌లా కూడా పళ్ళు తోముకుంటే పంటి సమస్యలు రావు. అలానే దంత క్షయానికి కారణం అయ్యే, కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండాలి. కానీ చాలా మంది తెలిసి కూడా కొన్ని తప్పుల్ని చేస్తూ ఉంటారు. ఈ పొరపాటులని అసలు చేయకుండా చూసుకోవాలి. చాక్లెట్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, మైదాతో చేసిన ఆహార పదార్థాలు వంటివి తీసుకోకూడదు.

chew this daily for some time to remove tooth decay

ఇలాంటివి తీసుకోవడం వలన దంత క్షయం సమస్య వస్తుంది. రోజుకి ఎన్ని సార్లు బ్రష్ చేసినా కూడా దీనిని ఆపలేరు. కానీ ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మాత్రం, కచ్చితంగా ఈ సమస్యలు రాకుండా ఉంటాయి. దంత క్షయం కాకుండా ఉండడానికి చెరుకును తీసుకోవడం మంచిది. చెరుకులో చక్కటి గుణాలు ఉంటాయి. చెరుకుని తీసుకుంటే, ఇలాంటి సమస్యలు కలగవు. చెరుకు రసంతో పాటుగా చెరుకు ముక్కల్ని కూడా మీరు తీసుకోవచ్చు.

కొన్ని చెరుకు ముక్కల్ని రోజూ తీసుకుంటే ఈ బాధ ఉండదు. రోజూ రాత్రి డిన్నర్ తర్వాత ఫ్రూట్స్, డ్రైఫ్రూట్స్ ని మీరు తీసుకుంటే దానితో పాటుగా కొన్ని చెరుకు ముక్కల్ని కూడా తీసుకోండి. దాంతో దంత క్షయం అవ‌దు. రాత్రిపూట నాలుగైదు చెరుకు ముక్కల్ని తినడం వలన నోరు చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఇలా మీరు పళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. పంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

Admin

Recent Posts