Cloves In Winter : చ‌లికాలంలో ల‌వంగాల‌ను తీసుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Cloves In Winter : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో ల‌వంగాలు కూడా ఒక‌టి. ల‌వంగాలు ఘాటైన వాస‌న‌ను, రుచిని క‌లిగి ఉంటాయి. వీటిని మ‌సాలా వంట‌ల్లో మ‌నం విరివిగా వాడుతూ ఉంటాము. మ‌నం చేసే వంటల‌కు ప్ర‌త్యేక‌మైన రుచిని తీసుకు రావ‌డంలో ల‌వంగాలు మ‌నకు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ల‌వంగాల‌ల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో ల‌వంగాల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో చల్ల‌టి వాతావ‌ర‌ణం ఉంటుంది. అలాగే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని చుట్టుముడ‌తాయి. క‌నుక చ‌లికాలంలో మ‌న శ‌రీరాన్ని ధృడంగా, మ‌రింత శ‌క్తివంతంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం.

చ‌లికాలం కోసం మన శ‌రీరాన్ని స‌న్న‌ద్దం చేయ‌డంలో ల‌వంగాలు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. ల‌వంగాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఫ్లూ, జ‌లుబు, ద‌గ్గు, గొంతునొప్పి వంటి స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. అలాగే ల‌వంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబ‌యాల్ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి. ల‌వంగాల‌ను పొడిగా చేసి గ్రీన్ టీ లో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల చ‌లికాలంలో ఎంతో మేలు క‌లుగుతుంది. అలాగే చాలా మంది చ‌లికాలంలో శ్వాస స‌మ‌స్య‌లు, ఇన్పెక్ష‌న్ ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. అలాంటి వారు ల‌వంగాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు తొల‌గిపోతాయి. దీర్ఘ‌కాలంగా వేధిస్తున్న ద‌గ్గు కూడా త‌గ్గుతుంది. అదే విధంగా చ‌లికాలంలో నొప్పులు ఎక్కువ‌గా ఉంటాయి.

Cloves In Winter many wonderful health benefits
Cloves In Winter

క‌నుక ఈ స‌మ‌యంలో ల‌వంగాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వీటిలో ఉండే యాంటీ ఇన్ ప్లామేట‌రీ గుణాలు నొప్పులను త‌గ్గించ‌డంలో ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. ల‌వంగాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీంతో చ‌లికాలంలో శ‌క్తి స్థాయిల్లో వ‌చ్చే మార్పులు రాకుండా ఉంటాయి. శ‌రీరంలో శ‌క్తి ఎల్ల‌ప్పుడూ స్థిరంగా ఉంటుంది. అలాగే చ‌లికాలంలో జీర్ణ‌శ‌క్తి కూడా త‌గ్గుతుంది. త‌రుచూ అజీర్తి, గ్యాస్, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. క‌నుక ల‌వంగాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ఈ విధంగా చ‌లికాలంలో ల‌వంగాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని చ‌లికాలంలో వీటిని త‌ప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts