Coconut Husk : మనం సాధారణంగా కొబ్బరికాయలకు ఉండే పీచును తీసేసి కొబ్బరి కాయలను కొట్టి లోపల ఉండే కొబ్బరిని తింటూ ఉంటాము. అలాగే ఈ కొబ్బరిని వంట్లలో వాడుతూ ఉంటాము. కొబ్బరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికి తెలుసు. దీనిని తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. కానీ మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే కొబ్బరి పీచు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ విషయం దాదాపుగా మనలో చాలా మందికి తెలియదు. కొబ్బరి పీచును వంటపాత్రలు శుభ్రం చేసుకోవడానికి, అలాగే గ్రామాల్లో పొయ్యిని వెలిగించడానికి మాత్రమే ఉపయోగించే వారు.
కానీ దీనిలో కూడా ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. కొబ్బరి పీచును వాడడం వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. కొబ్బరి పీచును శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి గోరువెచ్చగా తాగాలి. ఇలా తాగడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. డయేరియా, అతిసారం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ నీటిని తాగడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఈ నీటిలో ఉండే యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.
అలాగే పసుపు రంగులో ఉండే దంతాలను తెల్లగా మార్చడంలో కూడా కొబ్బరి పీచు మనకు సహాయపడుతుంది. కొబ్బరి పీచును ముక్కలుగా చేసి కళాయిలో వేసి నల్లగా అయ్యే వరకు వేయించాలి. తరువాత ఈ పీచును పొడిగా చేసి దానితో దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలు తెల్లగా మారతాయి. ఈ విధంగా కొబ్బరి పీచు కూడా మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ పీచును పడేయకుండా మనకు తగిన విధంగా వాడుకోవచ్చు.