Pappu Thotakura Vadalu : ప‌ప్పు తోట‌కూర వ‌డ‌ల‌ను ఇలా చేయండి.. ఎంతో ఇష్టంగా తింటారు..!

Pappu Thotakura Vadalu : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో బండ్ల మీద ల‌భించే వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ల్లో తోట‌కూర వ‌డ‌లు కూడా ఒక‌టి. ఈ వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ వ‌డ‌లు పైన క్రిస్పీగా లోప‌ల మెత్త‌గా చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ వ‌డ‌ల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. తోట‌కూర‌కు బ‌దులుగా ఇత‌ర ఆకుకూర‌ల‌తో కూడా ఈ వ‌డ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. స్ట్రీట్ స్టైల్ తోట‌కూర వ‌డ‌ల‌ను ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తోట‌కూర వ‌డ‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిన్న‌గా త‌రిగిన తోట‌కూర – 3 క‌ట్ట‌లు, 5 గంట‌ల పాటు నాన‌బెట్టిన శ‌న‌గ‌ప‌ప్పు – 5 గంట‌లు, ఎండుమిర్చి – 3, ప‌చ్చిమిర్చి – 3, వెల్లుల్లి రెబ్బ‌లు – 5, అల్లం – అర అంగుళం ముక్క‌, త‌రిగిన ఉల్లిపాయ – 1, జీల‌కర్ర -అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – డీప్ ఫ్రైకు స‌రిపడా.

Pappu Thotakura Vadalu recipe in telugu make in this method
Pappu Thotakura Vadalu

తోట‌కూర వ‌డ‌ల త‌యారీ విధానం..

ముందుగా జార్ లో నాన‌బెట్టిన శ‌న‌గ‌ప‌ప్పు, ఎండుమిర్చి, ప‌చ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని గిన్నెలోకి తీసుకుని అందులో త‌రిగిన తోట‌కూర‌, ఉల్లిపాయ ముక్క‌లు, జీల‌క‌ర్ర‌, ఉప్పు వేసి బాగా క‌ల‌పాలి. పిండి ప‌లుచ‌గా అయితే కొద్దిగా బియ్యంపిండి వేసి క‌లుపుకోవాలి. త‌రువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని వ‌డ‌లాగా వ‌త్తుకోవాలి. త‌రువాత ఈ వ‌డ‌ల‌ను నూనెలో వేసి కాల్చుకోవాలి. ఈ వ‌డ‌ల‌ను అటూ ఇటూ తిప్పుతూ మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే తోట‌కూర వ‌డలు తయారవుతాయి. ఈ వ‌డ‌ల‌ను ట‌మాట కిచ‌ప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఆకుకూర‌లు తిన‌ని పిల్ల‌ల‌కు ఇలా వ‌డ‌లు చేసి పెట్ట‌డం వ‌ల్ల వారు సుల‌భంగా ఆకుకూర‌లను తిన‌గ‌లుగుతారు.

Share
D

Recent Posts