భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్న మసాలా దినుసుల్లో లవంగాలు ఒకటి. వీటిని చాలా మంది తరచూ వంటల్లో వేస్తుంటారు. ఎక్కువగా మసాలా కూరలు, నాన్ వెజ్ వంటలు చేస్తే లవంగాలను వాడుతారు. వీటి వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే ఆయుర్వేద పరంగా లవంగాలతో ఎన్నో లాభాలు కలుగుతాయి. పూటకు ఒక లవంగం మొగ్గ చొప్పున రోజుకు మూడు సార్లు భోజనం అనంతరం వాటిని నోట్లో వేసుకుని నమిలి మింగాలి. దీంతో అనేక రోగాలకు చెక్ పెట్టవచ్చు. ఇక లవంగాలతో ఏయే ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది సీజన్ మారగానే దగ్గు, జలుబు వంటి సమస్యల బారిన పడుతుంటారు. అయితే లవంగాలను తినడం వల్ల ఈ రోగాలకు వెంటనే చెక్ పెట్టవచ్చు. ఎందుకంటే లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీని వల్ల సీజనల్ దగ్గు, జలుబు, జ్వరం సమస్యల నుంచి బయట పడవచ్చు. పూటకు ఒక లవంగం మొగ్గను నోట్లో వేసుకుని రోజుకు మూడు పూటలా నములుతూ ఉంటే ఈ సమస్యల నుంచి త్వరగా బయట పడవచ్చు.
ప్రస్తుతం చాలా మంది షుగర్ సమస్యతో అవస్థలు పడుతున్నారు. అయితే పూటకో లవంగం మొగ్గను నోట్లో వేసుకుని నమలాలి. భోజనం అనంతరం ఇలా చేయాలి. రోజుకు మూడు సార్లు ఇలా నమిలితే షుగర్ లెవల్స్ దెబ్బకు కంట్రోల్ అవుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలైన గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం నుంచి ఉపశమనం పొందవచ్చు.
లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన నోట్లో ఉండే బాక్టీరియాను నాశనం చేస్తాయి. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కనుక లవంగాలను రోజూ నమలాలి. ఇలా లవంగాలతో మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే వీటిని అధికంగా తింటే కడుపులో మంట వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక రోజుకు 3 లవంగాలకు మించి తీసుకోరాదు. ఈ విధంగా లవంగాలను తినడం వల్ల పైన తెలిపిన విధంగా అనేక ప్రయోజనాలను పొందవచ్చు.