హెల్త్ టిప్స్

మ‌న దేశంలో ప‌లు చోట్ల ల‌భించే భిన్న ర‌కాల రోటీలు.. వాటిని ఏయే ప‌దార్థాల‌తో త‌యారు చేస్తారో తెలుసుకోండి..!

మ‌న దేశంలో అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఒక్కో ప్రాంత వాసులు త‌మ అభిరుచులు, సంప్ర‌దాయాల‌కు అనుగుణంగా ఆహారాల‌ను తీసుకుంటుంటారు. అయితే మ‌న దేశంలో ఎక్క‌డికి వెళ్లినా రోటీలు ఫేమ‌స్‌. కొన్ని ప్రాంతాల్లో వాటిని భిన్న రకాల ప‌దార్థాలతో త‌యారు చేస్తారు. మరి ఆ ప‌దార్థాలు ఏమిటో, అవి మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన‌వా, లేదా అనారోగ్యాల‌ను క‌లిగిస్తాయా ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

1. తందూరీ రోటీ

ఈ రోటీ సాధార‌ణంగా మ‌న‌కు ఎక్కడైనా ల‌భిస్తుంది. హోట‌ళ్ల‌తోపాటు కొంద‌రు ఇళ్ల‌లోనూ ఈ రోటీల‌ను చేసుకుంటుంటారు. ఈ రోటీల‌ను ఎక్కువ‌గా గోధుమ పిండితో త‌యారు చేస్తారు. వీటిని తందూర్‌లో కాలుస్తారు. అయితే ఇంట్లో మ‌నం గోధుమ పిండిని వాడుతాం. అది ఆరోగ్య‌క‌ర‌మైన‌దే. కానీ బ‌య‌ట హోట‌ళ్ల‌లో గోధుమ పిండిని త‌క్కువ‌గా మైదా పిండిని ఎక్కువ‌గా వాడుతారు. అందువ‌ల్ల బ‌య‌ట ఈ రోటీల‌ను తిన‌డం ఆరోగ్యానికి హానిక‌రం. ఇంట్లో త‌యారు చేసుకుని తినాలి.

different types of rotis and their ingredients

2. మిస్సీ రోటీ

దీన్ని శ‌న‌గ‌పిండి, గోధుమ పిండి, మిరియాలు, వాము, ధ‌నియాల‌తో త‌యారు చేస్తారు. అందువ‌ల్ల ఇది అత్యంత ఆరోగ్య‌క‌ర‌మైన రోటీ అని చెప్ప‌వ‌చ్చు.

3. నాన్

దీన్ని స‌హ‌జంగా మైదా పిండితోనే త‌యారు చేస్తారు. అందువ‌ల్ల ఈ రోటీల‌ను తిన‌కూడ‌దు. అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఇవి జీర్ణం అయ్యేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ‌పై భారం ప‌డుతుంది. అందువ‌ల్ల వీటిని తిన‌క‌పోవ‌డ‌మే మంచిది.

4. చ‌పాతీ

చ‌పాతీల‌ను మ‌నం ఇంట్లోనైతే గోధుమ పిండితో త‌యారు చేసుకుంటాం. కానీ అవి ఆరోగ్య‌క‌ర‌మైన‌వి. కానీ బ‌య‌ట త‌యారు చేసే చ‌పాతీల్లో మైదా పిండి క‌లుస్తుంది. క‌నుక వాటిని తిన‌కూడ‌దు. ఇంట్లో నూనె వేయ‌కుండా చ‌పాతీల‌ను కాల్చి తిన‌డం మేలు.


ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts