మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణం అయితే ఏ సమస్యా ఉండదు. కానీ జీర్ణం కాకపోతేనే గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. మన జీర్ణశక్తి సహజంగానే తగ్గితే పైన తెలిపిన సమస్యలు వస్తాయి. లేదా పలు ఇతర కారణాల వల్ల కూడా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అయితే కింద తెలిపిన సేతు బంధాసనంను రోజూ వేస్తుంటే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. దీంతో అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం సమస్యలు తగ్గుతాయి. మరి ఈ ఆసనాన్ని ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
ముందుగా నేలపై వెల్లకిలా పడుకోవాలి. రెండు కాళ్లను మడిచి ఉంచాలి. రెండు చేతులతో రెండు కాలి మడమలను పట్టుకోవాలి. నడుము, పిరుదులని పైకి లేపాలి. భుజాలు, తలను నేలకు కింద పెట్టలి. ఈ స్థితిలో 20 సెకన్ల పాటు ఉండాలి. ఇలా మూడు సార్లు చేయాలి. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
1. ఈ ఆసనాన్ని రోజూ వేయడం వల్ల జీర్ణశక్తి అద్భుతంగా పెరుగుతుంది. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు, తిన్న ఆహారాలు సరిగ్గా జీర్ణం కాక అజీర్ణం సమస్య ఉన్నవారు ఈ ఆసనాన్ని రోజూ వేస్తుంటే ఫలితం ఉంటుంది. దీంతో అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి.
2. కడుపునొప్పి, విరేచనాలు తగ్గాలంటే ఈ ఆసనం వేయాలి.
3. ఈ ఆసనాన్ని వేయడం వల్ల వెన్ను, పిరుదులు, తొడ కండరాలు దృఢంగా మారుతాయి. నిత్యం కంప్యూటర్ల ఎదుట కూర్చుని పనిచేసేవారు ఈ ఆసనం వేయడం మంచిది.
4. ఈ ఆసనాన్ని రోజూ వస్తే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది.
5. ఈ ఆసనం వల్ల నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మెదడు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
6. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. థైరాయిడ్ గ్రంథులు సరిగ్గా పనిచేస్తాయి. పొట్ట వద్ద కండరాలు దృఢంగా మారుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365