Over Weight : ప్రస్తుత కాలంలో ఊబకాయంతో బాధపడే వారు రోజు రోజుకూ ఎక్కువవుతున్నారు. అలాగే కొందరి శరీరం అంతా సన్నంగా ఉన్నా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఊబకాయం.. అలాగే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువగా కూర్చొని పని చేయడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తినడం, సరైన వ్యాయామం లేని కారణాల వల్ల పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. కొన్ని రకాల చిట్కాలను వాడి పొట్ట చుట్టూ కొవ్వును, ఊబకాయాన్ని త్వరగా తగ్గించుకోవచ్చు. బరువును తగ్గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వారు ప్రతిరోజూ ఉదయం పరగడుపున తేనె, నిమ్మరసం కలిపిన నీటిని తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకు పోయిన కొవ్వు కరిగిపోతుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్, నువ్వుల నూనెను, ఒక టీ స్పూన్ అల్లం రసాన్ని వేసి రోజుకు రెండు పూటలా క్రమం తప్పకుండా తాగాలి. ఇలా చేయడం వల్ల చాలా త్వరగా బరువు తగ్గుతారు. అలాగే రాత్రి భోజనంలో పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. వీటిని కూడా చాలా త్వరగా తీసుకోవాలి. ఒకవేళ ఈ పండ్లను తిని ఉండలేని వారు పుల్కా వంటి వాటిని రాత్రి భోజనంలో భాగంగా తీసుకోవాలి.
రాత్రి పూట భోజనంలో అన్నాన్ని తీసుకోవడం కొద్ది రోజుల పాటు మానేయాలి. అలాగే ఉదయం పూట మొలకెత్తిన విత్తనాలను తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు. ఊబకాయం సమస్యతో బాధపడే వారికి గ్రీన్ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో సహాయపడతాయి. పండ్ల రసాలను, సలాడ్ లను, ఉడికించిన కూరగాయ ముక్కలను ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కడుపు నిండిన భావన కలగడంతోపాటు శరీరానికి అవసరమయ్యే పోషకాలు కూడా లభిస్తాయి.
బరువు తగ్గాలనుకునే వారికి కొబ్బరి నీళ్లు ఎంతగానో దోహదపడతాయి. ఇవి శరీరం జీవక్రియ రేటును పెంచి త్వరగా బరువు తగ్గేలా చేస్తాయి. ప్రతిరోజూ కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరానికి అవసరమయ్యే పోషకాలు లభించడంతోపాటు ఊబకాయం సమస్య నుండి కూడా బయటపడవచ్చు. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సబ్జా గింజలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. రాత్రి పడుకునే ముందు సబ్జా గింజలను నీటిలో వేసి నానబెట్టాలి. ఈ నీటిని ఉదయాన్నే తాగడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. సాధ్యమైనంత వరకు ఎక్కువదూరం నడిచే ప్రయత్నం చేయాలి.
కీళ్ల నొప్పులు సమస్య లేని వారు లిప్ట్ వాడకాన్ని తగ్గించి మెట్ల మార్గాన్ని వాడాలి. మన పొట్ట ప్రతి ఎనిమిది గంటలకొకసారి ఖాళీ అయ్యి ఆకలి అనిపిస్తుంది. ఈ సమయంలో జంక్ ఫుడ్ ను తీసుకోకుండా మంచి నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఆహార పదార్థాల తయారీలో తక్కువ నూనెను ఉపయోగించాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. రోజులో ఎక్కువ సార్లు పండ్లను, మొలకెత్తిన గింజలను తినాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల చాలా త్వరగా అధిక బరువు సమస్య నుండి బయట పడవచ్చు. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరిగి అందంగా, ఆరోగ్యంగా మారుతారు.