Grapes : ద్రాక్ష పండ్లు.. ఇవి మనందరికీ తెలుసు. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. మనకు వివిథ రకాల ద్రాక్ష పండ్లు లభిస్తాయి. ద్రాక్ష పండ్లను ఇష్టంగా తినప్పటికీ చాలా మందికి వీటిలో ఉండే పోషకాల గురించి, వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి.. తెలియదు. ద్రాక్ష పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ద్రాక్ష పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ లతోపాటు పొటాషియం, కాల్షియం, సెలీనియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నిషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
ద్రాక్ష పండ్లను తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా మూత్రపిండాల్లో రాళ్లను కరిగించే గుణం కూడా వీటికి ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పితో బాధపడే వారు ద్రాక్ష పండ్లను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ద్రాక్ష పండ్లను తరచూ తినడం వల్ల మలబద్దకం వంటి జీర్ణాశయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. గుండె దడ, ఆయాసం, తీవ్రమైన ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కునే వారు తరచూ ద్రాక్ష పండ్లను తినడం వల్ల ఆయా సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
రక్తంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలోనూ ద్రాక్ష పండ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ద్రాక్ష పండ్లను తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాలేయ పనితీరు కూడా మెరుగుపడుతుంది. వీటిలో అధికంగా ఉండే ఐరన్ రక్తకణాల సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది. నీరసంతో బాధపడుతున్నప్పుడు ద్రాక్ష పండ్లను తినడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. ద్రాక్ష పండ్లను తినడం వల్ల స్త్రీలల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
వీటిని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ద్రాక్ష పండ్లను ఎక్కవగా తీసుకోవడం వల్ల మెదడు పనితీరుతోపాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. వయస్సు మీద పడడం వల్ల వచ్చే దృష్టి లోపాలను తగ్గించడంలో కూడా ద్రాక్ష పండ్లు మనకు ఉపయోగపడతాయి. దంతాలను, ఎముకలను దృఢంగా ఉంచడంలో, చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ద్రాక్ష పండ్లు మనకు సహాయపడతాయి. ద్రాక్ష పండ్లను స్క్రబర్, మాయిశ్చరైజర్ వంటి చర్మ సంబంధిత వస్తువుల తయారీలో కూడా ఉపయోగిస్తారు.
నల్ల ద్రాక్ష పండ్లను తినడం వల్ల ముఖంపై వచ్చే ముడతలు కూడా తొలగిపోతాయి. ఈ విధంగా ద్రాక్ష పండ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని.. వీటిని కచ్చితంగా ఆహారంలో భాగంగా తీసుకోవాలని.. వైద్య నిపుణులు సూచిస్తున్నారు.