Categories: Featured

Ants : ఇంట్లో చీమలు ఎక్కువగా ఉన్నాయా ? ఇలా చేయండి..!

Ants : మన ఇళ్లలో దోమలు, ఈగలు సహజంగానే వస్తుంటాయి. ఇక కొన్ని సందర్భాల్లో చీమలు కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. తీపి పదార్థాలు కింద పడినప్పుడు లేదా పలు ఇతర సందర్భాల్లోనూ చీమలను చూస్తుంటాం. దీంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే చీమల బెడద నుంచి తప్పించుకోవచ్చు. మరి అందుకు ఏం చేయాలంటే..

if you have Ants at your home then follow these tips

1. ఇంట్లో ఏ మూల నుంచి చీమలు వస్తున్నాయో గమనించి ఆ ప్రదేశాల్లో వెనిగర్‌ను చల్లాలి. ముఖ్యంగా అవి వదిలిపెట్టిన ఫెరోమోన్స్‌ను నాశనం చేయాలి. ఎందుకంటే వీటి సహాయంతోనే తాము వచ్చిన స్పాట్స్‌ ను చీమలు గుర్తిస్తాయి. కనుక వెనిగర్‌ను చల్లడం వల్ల చీమలు మళ్లీ రాకుండా ఉంటాయి.

2. బారులు కట్టిన చీమలపై మిరియాల పొడిని చల్లగానే అవి చెల్లాచెదురైపోయి ఎక్కడి నుంచి వచ్చాయో ఆ ప్రదేశానికే వెళ్లిపోతాయి. అలా మిరియాల పొడి సహాయంతో వాటి ఎంట్రీ పాయింట్స్‌ను కనిపెట్టొచ్చు.

3. చీమలు ఇంట్లోకి రాకుండా టాల్కమ్‌ పౌడర్‌ లేదా చాక్‌లు ఎంతగానో పనిచేస్తాయి. ఈ రెండూ కూడా చీమల వాసనశక్తిని దెబ్బ తీస్తాయి. అందుకనే చాక్‌ లేదా ్ల్కామ్‌ పౌడర్‌తో గీసిన గీతలను దాటి అవి లోపలికి రాలేవు.

4. చీమలు రాకుండా నిమ్మ లేదా దోసకాయ తొక్కలు కూడా బాగా పనిచేస్తాయి. నిమ్మ తొక్క లేదా దోసకాయ తొక్కను చీమలు ఉండే ప్రదేశంలో పెడితే వాసనకు చీమలు పారిపోతాయి. అంతేకాదు, చీమలు తినే ఒక రకమైన ఫంగస్‌ను దోస లేదా నిమ్మకాయ తొక్కలు నాశనం చేస్తాయి. ఇలా చీమల బెడద నుంచి విముక్తి పొందవచ్చు.

Admin

Recent Posts