Boiled Eggs : ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌ను తిన్న త‌రువాత‌.. వీటిని తీసుకోకండి.. ఎందుకో తెలుసా..?

Boiled Eggs : త‌క్కువ ధ‌ర‌లో ఎక్కువ పోష‌కాల‌ను అందించే ఆహారాల్లో కోడిగుడ్లు ఒక‌టి. కోడిగుడ్ల‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్, విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తో పాటు ఇత‌ర ముఖ్య‌మైన పోష‌కాలు అన్నీ ల‌భిస్తాయి. కోడిగుడ్ల‌ను ఉడికించి తీసుకోవ‌డం వ‌ల్ల మాత్ర‌మే దానిలోని పోష‌కాల‌ను మ‌నం పూర్తి స్థాయిలో పొంద‌వ‌చ్చు. కోడిగుడ్ల‌ను ఉడికించి తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఉడికించిన కోడిగుడ్ల‌ను తిన్నా త‌రువాత లేదా వాటితో పాటు మ‌నం కొన్ని ఆహార ప‌దార్థాల‌ను తీసుకోకూడ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. ఉడికించిన కోడిగుడ్ల‌తో పాటు లేదా కోడిగుడ్ల‌ను తిన్న త‌రువాత తీసుకోకూడ‌ని ప‌దార్థాలు ఏమిటి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పాలు మ‌రియు చేప‌లు ఎలా అయితే క‌లిపి తిన‌కూడ‌దో అదేవిధంగా ఉడికించిన కోడిగుడ్ల‌ను తిన్న త‌రువాత లేదా వాటితో క‌లిపి మాఫియా ఫిష్ ఫ్రై కానీ, పులుసు కానీ తిన‌కూడ‌దు. అలా తిన‌డం వ‌ల్ల చ‌ర్మం దుర‌దలు, ద‌ద్దుర్లు రావ‌డంతో పాటు చ‌ర్మం ఎర్రగా మారుతుంది. అదే విధంగా ఉడికించిన కోడిగుడ్లు తిన్న త‌రువాత లేదా వాటితో నిమ్మ‌ర‌సాన్ని తీసుకోకూడ‌దు. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల దుష్ప్ర‌భావాల బారిన ప‌డాల్సి వస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. కొంద‌రికి ఉడికించిన కోడిగుడ్డును క‌ట్ చేసి దానిపై మ‌సాలాల‌ను, నిమ్మ‌కాయ‌ను పిండి తింటుటారు. ఇలా తినే వారు ఆ అల‌వాటును త్వ‌ర‌గా మానుకోవాలి. అలాగే ఉడికించిన కోడిగుడ్డు తిన్న రెండు గంట‌ల త‌రువాత మాత్ర‌మే అర‌టికాయ‌ను తినాలి. గుడ్డును తిన్న వెంట‌నే అర‌టి పండునుత తిన‌కూడ‌దు. ఇలా తిన‌డం వ‌ల్ల అల‌ర్జీ, దుర‌దుల‌, ద‌ద్దుర్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

do not take these after eating Boiled Eggs know why
Boiled Eggs

పూర్తిగా ఉడికించిన కోడిగుడ్డు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ప‌చ్చికోడిగుడ్డు కూడా మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ కొంద‌రు కోడిగుడ్డు స‌గం ఉడికించి తీసుకుంటుంటారు. ఇలా తీసుకోవ‌డం ఆరోగ్యానికి హానిని క‌లిగిస్తుంది. గుడ్డును స‌గం ఉడికించి తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపులో ఇన్ఫెక్ష‌న్ లు రావ‌డం, వాంతులు అవ్వడం వంటివి జ‌రుగుతాయి. కోడిగుడ్డులోని ప‌చ్చ‌సొన జీర్ణ‌మ‌వ్వ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది. క‌నుక చిన్న పిల్ల‌ల‌కు, వ‌య‌సు పై బ‌డిన వారికి కోడిగుడ్డులోని ప‌చ్చ‌సొన‌ను ఇవ్వ‌క‌పోవ‌డ‌మే మంచిది. అదేవిధంగా బీపీ, షుగ‌ర్ ఉన్న వారు కూడా కోడిగుడ్డులోని ప‌చ్చ‌సొన‌కు దూరంగా ఉండాలి. ఎక్కువ కాలం నిల్వ ఉన్న కోడిగుడ్ల‌ను తీసుకోకూడ‌దు. తాజా కోడిగుడ్ల‌ను మాత్ర‌మే తీసుకోవాలని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

Share
D

Recent Posts