హెల్త్ టిప్స్

Jamun Seeds : నేరేడు పండ్ల‌ను తిని విత్త‌నాల‌ను ప‌డేస్తున్నారా.. ఇవి తెలిస్తే ఇక‌పై అలా చేయ‌రు..!

Jamun Seeds : చాలామంది తెలియకుండా పోషకాలని పడేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఈరోజు నేరేడు పండ్ల విత్త‌నాల‌లో ఉండే పోషక పదార్థాల గురించి చూద్దాం. నేరేడు పండ్లు తిన్న తర్వాత విత్తనాల‌ని అస్సలు పారేయద్దు. నిజానికి నేరేడు విత్త‌నాలని తీసుకోవడం వలన ఎన్నో రకాల లాభాలు పొందడానికి అవుతుంది. నేరేడు గింజల వలన లాభాలు చూశారంటే, మీరు కూడా కచ్చితంగా ఈసారి నేరేడు గింజల్ని పడేయకుండా ఉపయోగిస్తారు. నేరేడు గింజల వలన చక్కటి లాభాలని పొందడానికి అవుతుంది.

నేరేడు గింజల్ని పొడి చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందొచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వలన బీపీని బాగా కంట్రోల్ చేస్తాయి. నేరేడు గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి నేరేడు గింజలను తీసుకోవడం వలన జీర్ణక్రియ రేటుని మెరుగుపరచుకోవచ్చు. ఆకలిని కూడా నేరేడు గింజలు నియంత్రిస్తాయి. బరువు తగ్గడానికి కూడా నేరేడు గింజలు బాగా ఉపయోగపడతాయి. అల్సర్, వాపులు వంటి బాధల నుండి కూడా నేరేడు గింజలు ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తాయి.

do not throw away jamun seeds after eating fruit

జీర్ణవ్యవస్థను కూడా నేరేడు గింజల‌ పొడి ద్వారా మెరుగుపరుచుకోవచ్చు. నేరేడు గింజల్ని తీసుకోవడం వలన రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. ఫ్రీ రాడికల్స్ ని కూడా ఈ పొడి తొలగిస్తుంది. షుగర్ తో బాధపడే వాళ్ళు నేరేడు గింజలతో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు.

నేరేడు గింజలలో ఉండే జాంబోలైన్‌, జంబోసైన్ స‌మ్మేళ‌నాలు రక్తంలో షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి అయ్యేటట్టు చూస్తాయి. ఇలా నేరేడు గింజల వలన ఒకటి కాదు రెండు కాదు ఎన్నో లాభాలని పొందొచ్చు. ఈసారి నేరేడు పండ్లు తినేటప్పుడు వీటిని ప‌డేయ‌కండి. ఈ గింజల్ని ఉపయోగించండి. అప్పుడు ఈ లాభాలని కూడా పొందొచ్చు. మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు.

Admin

Recent Posts