Ajwain Tea : వామును భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఇది వంటి ఇంటి పదార్థంగా ఉంది. దీన్ని తరచూ వివిధ రకాల వంటల్లో వేస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్రకారం వాములో అనేక అద్భుతమైన ఔషధగుణాలు ఉంటాయి. ఇది అనేక రకాల వ్యాధులను తగ్గించగలదు. అయితే వాము గింజలను నేరుగా ఎవరూ తినలేరు. చాలా ఘాటుగా, కారంగా ఉంటాయి. కానీ వీటితో టీ తయారు చేసుకుని తాగితే ఎంచక్కా రుచికి రుచి లభిస్తుంది. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మరి వాము టీని ఎలా తయారు చేయాలి.. దాంతో ఎలాంటి లాభాలు కలుగుతాయి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
ఒక కప్పున్నర నీళ్లను ఒక పాత్రలో పోయాలి. అందులో 1 టీస్పూన్ వాము గింజలను వేయాలి. తరువాత ఆ నీళ్లను సన్నని మంటపై 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. దీంతో కప్పు నీళ్లు అవుతాయి. తరువాత ఆ నీళ్లను వడకట్టాలి. అందులో ఒక టీస్పూన్ తేనె కలిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.
1. కడుపులో మంట, అజీర్ణం సమస్యలు ఉన్నవారు ఇలా వాము గింజలతో టీని తయారు చేసుకుని తాగితే.. వెంటనే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గించడంలో వాము అద్భుతంగా పనిచేస్తుంది. దీని వల్ల కడుపులో మంట వెంటనే తగ్గిపోతుంది. అలాగే తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్ సమస్య ఉండదు.
2. దగ్గు, జలుబు సమస్యలు ఉన్నవారు వాము టీని తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. శ్వాసకోశ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. సీజనల్‌గా వచ్చే వ్యాధులు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.
3. వాము గింజల టీ తాగడం వల్ల నోట్లోని బాక్టీరియా అంతా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.
4. వాము గింజల టీని రోజుకు రెండు సార్లు.. ఉదయం, సాయంత్రం.. కాఫీ, టీలకు బదులుగా తాగితే.. శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
5. వాము గింజల టీని రోజుకు రెండు సార్లు తాగితే కీళ్ల నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి, విరిగిన ఎముకలు అతుక్కుంటున్న వారికి ఈ టీ ఎంతగానో మేలు చేస్తుంది.