Cardamom Water : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్న వంట ఇంటి దినుసుల్లో యాలకులు ఒకటి. వీటిని తరచూ వివిధ రకాల వంటల్లో వేస్తుంటారు. ముఖ్యంగా వీటిని తీపి వంటకాల్లో బాగా ఉపయోగిస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్రకారం యాలకులలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఈ క్రమంలోనే వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా యాలకులతో నీళ్లను తయారు చేసి రోజూ పరగడుపునే తాగితే ఎన్నో లాభాలను పొందవచ్చు.
యాలకుల నీళ్లను ఇలా తయారు చేయాలి..
అర లీటర్ నీటిలో పొట్టు తీసిన 3, 4 యాలకులను వేయాలి. రాత్రంతా వాటిని నీటిలో నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని అలాగే మరిగించాలి. నీళ్లు పావు లీటర్ అయ్యే వరకు ఆ నీటిని మరిగించాలి. తరువాత వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా రోజూ క్రమం తప్పకుండా ఈ నీళ్లను తాగుతుండాలి. దీంతో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
1. యాలకుల నీళ్లను రోజూ పరగడుపునే తాగడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఎంత ఎక్కువ షుగర్ ఉన్నా సరే.. ఈ నీళ్లను తాగితే కొద్ది రోజుల్లోనే మార్పు వస్తుంది.
2. యాలకుల నీళ్లను తాగడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. మలబద్దకం తగ్గుతుంది. జీర్ణవ్యవస్థలో ఉండే వ్యర్థాలు అన్నీ బయటకు పోతాయి. గ్యాస్, కడుపులో మంట, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
3. అధిక బరువు ఉన్నవారు, పొట్ట దగ్గర కొవ్వు బాగా ఉన్నవారు యాలకుల నీళ్లను తాగితే ఫలితం ఉంటుంది. 14 రోజుల పాటు ఈ నీళ్లను తాగి చూస్తే మీ శరీర బరువు చాలా వరకు తగ్గుతుంది. మీ శరీరంలో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు.
4. కొలెస్ట్రాల్, హైబీపీ ఉన్నవారు యాలకుల నీళ్లను తాగితే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
5. ఈ నీళ్లను తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల సీజనల్ వ్యాధులు నుంచి బయట పడవచ్చు. జ్వరం తగ్గుతుంది.
6. యాలకుల నీళ్లను తాగితే రక్తనాళాల్లో ఉండే క్లాట్స్ కరిగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ముందుగానే అడ్డుకోవచ్చు.