Ginger Tea : ప్రస్తుత తరుణంలో ఎవరిని చూసినా రోగాల బారిన పడి అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఒక పట్టాన వ్యాధులు తగ్గడం లేదు. దీంతో ఇంగ్లిష్ మెడిసిన్‌లను చాలా మింగాల్సి వస్తోంది. అయితే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే 90 శాతం వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. మనకు రోగ నిరోధక శక్తి తగ్గితేనే అనేక వ్యాధులు వస్తాయి. కనుక ఆ శక్తిని పెంచుకుంటే అనేక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. దీంతో ఎల్లప్పుడూ రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే రోగ నిరోధక శక్తి పెరిగేందుకు ఏం తీసుకోవాలి ? అని చాలా మంది సందేహిస్తుంటారు. కానీ అంతగా సందేహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అల్లంతో తయారు చేసే ఈ టీని రోజుకు రెండు సార్లు తాగితే చాలు.. దెబ్బకు రోగ నిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. మరి ఆ అల్లం టీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
రోగ నిరోధక శక్తిని పెంచే అల్లం టీ తయారీకి కావల్సిన పదార్థాలు..
అల్లం – తగినంత, తులసి ఆకులు – 4, సోంపు గింజలు – 1 టీస్పూన్, జీలకర్ర – పావు టీస్పూన్, దాల్చిన చెక్క పొడి – పావు టీస్పూన్, వాము – పావు టీస్పూన్.
అల్లం టీని తయారు చేసే విధానం..
ఒక పాత్ర తీసుకుని అందులో 2 కప్పుల నీళ్లను పోయాలి. తరువాత అందులో పైన తెలిపిన పదార్థాలన్నింటినీ వేయాలి. అనంతరం సన్నని మంటపై ఆ నీళ్లను 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. తరువాత వడకట్టి ఆ టీలో కాస్త తేనె కలుపుకుని గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా ఈ టీని తయారు చేసుకుని రోజుకు 2 సార్లు తాగాలి. దీంతో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ టీలో వాడిన అన్ని పదార్థాల్లోనూ అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. అన్నింటినీ విడిగా తీసుకోవడం కన్నా.. ఇలా అన్నింటినీ కలిపి టీ లా తయారు చేసుకుని తాగితే ఎంతో మేలు జరుగుతుంది. కేవలం రోగ నిరోధక శక్తి పెరగడం మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.